రోగులకు చేతబడి చేశారంటూ క్షుద్రపూజలు చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు !! చివరికి ??
హైదరాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఎల్బీనగర్‌లోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు సోదాలు చేశారు. భూతవైద్యం పేరుతో ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్న జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో భారీగా క్షుద్రపూజలకు సంబంధించిన సామాగ్రిని గుర్తించిన పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. పుర్రెల దండలు, ఉర్తూలో రాసిఉన్న కొన్ని పత్రాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఎల్బీనగర్‌లోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు సోదాలు చేశారు. భూతవైద్యం పేరుతో ఇంట్లో క్షుద్రపూజలు చేస్తున్న జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో భారీగా క్షుద్రపూజలకు సంబంధించిన సామాగ్రిని గుర్తించిన పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. పుర్రెల దండలు, ఉర్తూలో రాసిఉన్న కొన్ని పత్రాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని ఓ కాలనీలో GNR ఆయుర్వేదం పేరుతో హస్పిటల్ నిర్వహిస్తున్నాడు జ్ఞానేశ్వర్. వైద్యం కోసం తనవద్దకు వచ్చిన రోగులకు చేతబడి చేశారని, దాని విరుగుడుకు ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించి క్షుద్ర పూజలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడు. జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ డాక్టర్ క్షుద్రపూజల ఖాతాలో వీఐపీలు కూడా ఉన్నట్టు సమాచారం. వాట్సప్ కాల్ లిస్ట్, మెస్సేజ్ చాటింగ్ లో కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. సీసీపుటేజ్, హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Navdeep: నవదీప్ గుట్టంతా ఆ మొబైల్ ఫోన్‌లోనే !! ఫోన్ తెరిస్తే హీరో పని ఔట్.
Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది
Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు
Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??
వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం