Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది

Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది

Phani CH

|

Updated on: Sep 27, 2023 | 9:59 AM

కార్ల తయారీ రంగంలో తనదైన ముద్ర వేసి టెస్లా సంస్థ రోబోటిక్‌ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమ సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబోకి సంబంధించిన వీడియోను తన టెస్లా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో టెస్లా సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబో తనకు తానుగా వస్తువులను గుర్తించి వాటిని క్రమపద్ధతిలో సర్ధుతోంది. అంతేకాదు మధ్యలో ఎవరైనా వచ్చి తనను కన్‌ఫ్యూజ్‌ చేసినా ఏమాత్రం పొరపాటు పడకుండా

కార్ల తయారీ రంగంలో తనదైన ముద్ర వేసి టెస్లా సంస్థ రోబోటిక్‌ రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమైందా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమ సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబోకి సంబంధించిన వీడియోను తన టెస్లా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో టెస్లా సంస్థ తయారు చేసిన హ్యుమనాయిడ్‌ రోబో తనకు తానుగా వస్తువులను గుర్తించి వాటిని క్రమపద్ధతిలో సర్ధుతోంది. అంతేకాదు మధ్యలో ఎవరైనా వచ్చి తనను కన్‌ఫ్యూజ్‌ చేసినా ఏమాత్రం పొరపాటు పడకుండా వాటిని కరెక్ట్‌గా వాటిని గుర్తించి వాటి స్థానంలో ఉంచుతోంది. అంతేకాదు ఈ రోబో యోగాసనాలు కూడా చేస్తోంది. నమస్కారం చేస్తోంది… మనుషుల్లాగే యోగాలోని వివిధ భంగిమల్లో ఆసనాలు వేస్తోంది. ఈ క్రమంలో తన కాళ్లు, చేతులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంది. టెస్లా కార్ల తరహాలోనే న్యూరల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వీడియో ఇన్‌పుట్‌ను క్షుణ్నంగా సమీక్షించి తదనుగుణంగా ఔట్‌పుట్‌ను అందిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. హ్యూమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు తెలిపారు. అయితే, ఈ రోబోను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై మస్క్ కానీ, టెస్లా కంపెనీ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. టెస్లా కంపెనీ నుంచి వస్తున్న మరో అద్భుతమంటూ పొగుడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు

Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??

వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం

24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు

Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్