వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం
పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిన రోడ్డు.. ఒక్కసారిగా నడిరోడ్డుపై అలజడి.. భారీ గుమికూడిన జనం వెతుకులాట మొదలుపెట్టారు.. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదంతా ఎందుకని ఆరా తీస్తే.. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లో ఇది చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో నడిరోడ్డపై జనం వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పూర్తిగా ట్రాఫిక్‌తో నిండిన రోడ్డు.. ఒక్కసారిగా నడిరోడ్డుపై అలజడి.. భారీ గుమికూడిన జనం వెతుకులాట మొదలుపెట్టారు.. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదంతా ఎందుకని ఆరా తీస్తే.. వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన సూరత్‌లో ఇది చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌లో నడిరోడ్డపై జనం వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన వరచ్చా ప్రాంతంలో ఓ వ్యాపారి పొరపాటున వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్టు రూమర్లు వ్యాపించాయి. నడిరోడ్డుపై పడిపోయిన ఆ సంచిలో కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయని ఓ మెసేజ్ చక్కర్లు కొట్టింది. అంతే.. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జనం నడిరోడ్డుపై వాహనాలు ఆపి వజ్రాల కోసం వెతుకులాట ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. అక్కడి రోడ్డును ఊడుస్తూ కొందరు, కూర్చుని అణువణువూ గాలిస్తూ మరికొందరు వజ్రాల కోసం వెతుకుతున్న వీడియోలు సోషల్ మీడియాకెక్కాయి. కొందరికి కొన్ని వజ్రాలు కనిపించినా అవి ఇమిటేషన్ జ్యుయెలరీలో వాడే అమెరికన్ డైమండ్స్ అని తేలడంతో ఉసూరుమన్నారు. ఇది ప్రాంక్ అయి ఉంటుందని మరికొందరు పెదవి విరుచుకుంటూ అక్కడి నుంచి జారుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు
Chandramukhi 2: పెద్దమ్మతల్లిని దర్శించుకున్న ‘చంద్రముఖి 2’ టీమ్
Pooja Hegde: స్టార్ క్రికెటర్‌ను పెళ్లాడబోతున్న బుట్ట బొమ్మ ??
మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..
Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్.. ఎందుకంటే ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

