మ్యూజియంలో ‘బాహుబలి’ స్టాట్యూ.. ఫొటోను ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ ని గుర్తించిన లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం.. గతంలోనే అక్కడ బాహుబలి అవతార్ లో ప్రభాస్ మైనపు బొమ్మని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బాహుబలి’. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమాతో ప్రభాస్ ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ ని గుర్తించిన లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం.. గతంలోనే అక్కడ బాహుబలి అవతార్ లో ప్రభాస్ మైనపు బొమ్మని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతి ఒక్కరు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. దీంతో ప్రభాస్ కి మరింత గుర్తింపు వచ్చిందని అభిమానులు, బాహుబలికి కూడా మంచి రీచ్ వచ్చిందని చిత్రయూనిట్ సంతోషించారు. ఇప్పుడు తాజాగా మరో ప్రభాస్ మైనపు బొమ్మ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మైసూరులోని ఓ మ్యూజియంలో అమరేంద్ర బాహుబలి గెటప్ లో ఉన్న ప్రభాస్ స్టాట్యూని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ మైనపు బొమ్మని చూసిన నెటిజెన్స్, ప్రభాస్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు. ఆ మైనపు విగ్రహం చూడడానికి అసలు ప్రభాస్ లాగానే లేదు. బాహుబలి గెటప్ లో ఎవరిదో మైనపు విగ్రహం పెట్టారని, ఆ బొమ్మని తీసేయాలని, ప్రభాస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయొద్దని అభిమానులు, నెటిజన్లు ఆ మైనపు బొమ్మపై ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ బాహుబలి మైనపు బొమ్మ కాస్తా వివాదంలో నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raghava Lawrence: రజినీ కాళ్లు మొక్కిన లారెన్స్.. ఎందుకంటే ??
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

