Navdeep: నవదీప్ గుట్టంతా ఆ మొబైల్ ఫోన్‌లోనే !! ఫోన్ తెరిస్తే హీరో పని ఔట్.
మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా, హీరో నవదీప్ డ్రగ్ గుట్టు అంతా ఆ ఫోన్‌లోనే ఉందంటున్నారు పోలీసులు. అవును, నవదీప్ తన సినిమాటిక్ తెలివి తేటల్ని పోలీసుల ముందు ప్రదర్శించాడు. నార్కోటిక్ విచారణకు తన తల్లి ఫోన్ తీసుకెళ్లి అధికారులనే బోల్తా కొట్టించాలని చూశాడు!. డ్రగ్స్ లింకులతో అడ్డంగా దొరికిపోయిన నవదీప్‌కే అంత తెలివి ఉంటే మరి పోలీసులకెంతుండాలి!. ఆమాత్రం కనిపెట్టలేరా?. ఇదే మాటన్నారు నార్కోటిక్ వింగ్ అధికారులు.
మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉందన్నట్టుగా, హీరో నవదీప్ డ్రగ్ గుట్టు అంతా ఆ ఫోన్‌లోనే ఉందంటున్నారు పోలీసులు. అవును, నవదీప్ తన సినిమాటిక్ తెలివి తేటల్ని పోలీసుల ముందు ప్రదర్శించాడు. నార్కోటిక్ విచారణకు తన తల్లి ఫోన్ తీసుకెళ్లి అధికారులనే బోల్తా కొట్టించాలని చూశాడు!. డ్రగ్స్ లింకులతో అడ్డంగా దొరికిపోయిన నవదీప్‌కే అంత తెలివి ఉంటే మరి పోలీసులకెంతుండాలి!. ఆమాత్రం కనిపెట్టలేరా?. ఇదే మాటన్నారు నార్కోటిక్ వింగ్ అధికారులు. డీఎస్పీ సునీతారెడ్డి. నవదీప్ తన ఫోన్లను ఫార్మాట్ చేయడంపై అనుమానాలు ఉన్నాయన్నారు నార్కోటిక్ వింగ్ డీఎస్పీ సునీతారెడ్డి. నవదీప్ డ్రగ్స్ లింక్స్ గుట్టు మొత్తం ఆ ఫోన్లలోనే ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం, ఆ ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక ఈ డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారో మొత్తం బయటికొస్తుందంటున్నారు నార్కోటిక్ వింగ్ డీఎస్పీ సునీతారెడ్డి. ఫోన్లను ఫార్మాట్ చేయడమే కాదు, మీడియా ప్రశ్నలకు కూడా చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడు నవదీప్. పిలిచారు-అడిగారు-ఆన్సర్స్ చెప్పానంటూ సింపుల్‌గా తేల్చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Elon Musk: ఎలాన్ మస్క్ మంత్రమేశాడు.. రోబో యోగా చేస్తోంది
Delhi Metro: మెట్రోలో మారని బుద్ధి.. బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు
Ram Charan: రామ్ చరణ్ ముఖానికి గాయం !! అసలేం జరిగిందంటే ??
వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. రద్దీగా మారిన ప్రాంతం
24 సార్లు ప్రయత్నించాడు.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు