AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhuri Dixit : మాధురి దీక్షిత్ ‘రాచరికపు’ సోయగం.. బాటిల్ గ్రీన్ చీరలో మెరిసిపోతున్న ధక్ ధక్ గర్ల్!

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ, ధక్ ధక్ గర్ల్ మాధురి దీక్షిత్ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమెలోని మెరుపు ఏమాత్రం తగ్గకపోగా, మరింత ఇనుమడిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

Madhuri Dixit : మాధురి దీక్షిత్ ‘రాచరికపు’ సోయగం.. బాటిల్ గ్రీన్ చీరలో మెరిసిపోతున్న ధక్ ధక్ గర్ల్!
Madhuri Dixit
Nikhil
|

Updated on: Mar 03, 2026 | 6:00 AM

Share

వివాహ సీజన్ కు సరిగ్గా సరిపోయేలా ఉన్న ఆమె లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె కళ్లు మాట్లాడతాయి.. ఆమె చిరునవ్వు కోటి కాంతులను వెదజల్లుతుంది. మూడు దశాబ్దాలుగా భారతీయ వెండితెరపై తన అసమానమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులను మైమరపిస్తున్న ఆ అగ్ర నటి, ఇప్పుడు ఒక అద్భుతమైన చీర కట్టులో దర్శనమిచ్చింది. రాజదర్బారులో కూర్చున్న మహారాణిలా హుందాగా కనిపిస్తూ, కనుచూపు తిప్పుకోనివ్వనంత అందంతో అలరిస్తోంది. జనవరి 31న ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ సీనియర్ బ్యూటీ మరెవరో కాదు.. మాధురి దీక్షిత్.

బాటిల్ గ్రీన్ లుక్..

వివాహ వేడుకల సీజన్ కు తగినట్లుగా మాధురి దీక్షిత్ ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరను ఎంచుకున్నారు. ఆ పచ్చదనం ఆమెకు ఒక రాచరికపు రూపాన్ని అందించింది. చీర అంచుల వెంబడి ఉన్న జర్దోజీ ఎంబ్రాయిడరీ ఆ చీర విలాసాన్ని మరింత రెట్టింపు చేసింది. దానికి సరిపోయేలా అదే రంగులో ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి, లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ కు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సోఫాలో స్టైలిష్ గా కూర్చుని ఉన్న తీరు, జాలువారుతున్న పల్లు చూస్తుంటే సాక్షాత్తు ఒక మహారాణిని చూస్తున్న అనుభూతి కలుగుతోంది.

ధర వింటే నోరెళ్లబెట్టాల్సిందే..

ఈ అద్భుతమైన చీరను ప్రముఖ డిజైనర్ జయంతి రెడ్డి లేబుల్ నుండి తీసుకున్నారు. దీని ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విలాసవంతమైన చీర విలువ అక్షరాలా రూ. 1,39,900. అంటే దాదాపు లక్షా నలభై వేల రూపాయల వరకు పలుకుతోంది. ఆ చీరకు తగ్గట్టుగా మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్ స్టైల్ ఆమె లుక్ ను మరింత గ్రాండ్ గా మార్చేశాయి. మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. 1965 నాటి క్లాసిక్ సినిమా ‘గైడ్’ లోని లతా మంగేష్కర్ పాడిన “పియా తోసే నైనా లాగే రే” అనే పాటను క్యాప్షన్ గా ఇచ్చారు. ఆ పాటలోని భావానికి తగ్గట్టే ఆమె కళ్లలో ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపిస్తోంది. ఐదు పదుల వయసులో కూడా తన ఫిజిక్ ను, గ్లామర్ ను కాపాడుకుంటూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఏ రంగు చీర కట్టినా మాధురి అందం రెట్టింపు అవుతుంది అనడానికి ఈ లేటెస్ట్ ఫోటోలే నిదర్శనం. వివాహ వేడుకల్లో గ్రాండ్ గా కనిపించాలనుకునే వారికి మాధురి దీక్షిత్ ఎంచుకున్న ఈ బాటిల్ గ్రీన్ సిల్క్ చీర ఒక మంచి స్ఫూర్తి అని చెప్పాలి.

Follow Us
ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా..
ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా..
రోజూ పల్లీలు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
రోజూ పల్లీలు తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
లక్ష్మీ కటాక్షం కోసం ఈ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ 3 తప్పులు ..
లక్ష్మీ కటాక్షం కోసం ఈ మొక్క పెంచుతున్నారా? అయితే ఈ 3 తప్పులు ..
మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ తో పూల వర్షమే!
మీ మందార మొక్కకు పూలు పూయడం లేదా? ఈ సీక్రెట్ తో పూల వర్షమే!
నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?వీడియో
నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?వీడియో
ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు
ముంబై టీమ్‎కి నేనే దిక్కు.. వీడి కాన్ఫడెన్స్ మామూలుగా లేదు
వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్
వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్
హాస్టల్లో ఇదేం పని.. చదువుకోవడానికి వెళ్లి ఏం చేస్తున్నారు..?
హాస్టల్లో ఇదేం పని.. చదువుకోవడానికి వెళ్లి ఏం చేస్తున్నారు..?
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ పని చేస్తే ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదు
మామిడిపండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త!ఈ విషయాలు గుర్తుంచుకోండి
మామిడిపండ్లు కొంటున్నారా? అయితే జాగ్రత్త!ఈ విషయాలు గుర్తుంచుకోండి