AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి అనుకూలంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope in Telugu (March 03, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. జీతభత్యాలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తుల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి అనుకూలంగా ఆర్థిక పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 02 March 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మార్చి 3, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం నెలకొనే అవకాశముంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగు తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. ఆదాయం పెరిగినప్పటికీ అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తుల్లో ఆర్థిక పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన సౌకర్యం కలుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు లాభాల పంట పండించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతితో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు విదేశీ కంపెనీల నుంచి కూడా సానుకూల సమాచారం అందుకుంటారు. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి ధనం వసూలవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఇంటా బయటా బాధ్య తలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ సంబంధ మైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక విషయాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్య క్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ పరంగా ఆశించిన సహకారం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఏ వృత్తి అయినప్పటికీ తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తల పెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Follow Us