Monsoon: అయ్యో.. అక్కడ వందేళ్లలో ఎన్నడూ లేని వర్షాభావం.. ఉసూరుమనిపించిన రుతుపవనాలు..
2018 వరదలు కేరళను వణికించాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. అలాగే వందేళ్లలో పదుల సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు కేరళను అనేక సార్లు అతలాకుతలం చేశాయి. సాధారణ పరిస్థితుల్లోకి రావడానికి ప్రజలకు సంవత్సరాల సమయం పట్టింది. అయితే ఇపుడు భిన్నమైన పరిస్థితులు కేరళను భయపెడుతున్నాయి. అత్యల్ప వర్షపాతం లెక్కలు ఆందోళనను కలిగిస్తున్నాయి. వందేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని నిపుణులు తేల్చిచెప్పారు.

రుతుపవనాల తిరోగమనం మొదలైంది. భారత వాతావరణ విభాగం ఈ కీలక ప్రకటనను వెల్లడించింది. కేరళ 100 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షాకాలాన్ని ఈ ఏడాది కనిపించిందని ఐఎండీ తెలిపింది.. రుతుపవనాల ఉపసంహరణ సాధారణం కంటే ఎనిమిది రోజుల ఆలస్యంగా ప్రారంభమైంది. భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సాధారణంగా జూన్ 1న కేరళలో ప్రవేశించే ఈ రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించి.. సెప్టెంబరు 17న వాయవ్య దిశగా అంటే రాజస్థాన్ మీదిగా తిరుగుముఖం పడుతాయి. అయితే, ఈ ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా ఈ తిరోగమనం కనిపించింది. అంటే సెప్టెంబరు 25 నుంచి రుతుపవనాలు వెనక్కి వెళ్లే ప్రక్రియ ప్రారంభమైందని ఐఎండీ తెలిపింది. భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా తిరోగమించడం వరుసగా ఇది 13వ సంవత్సరం అని చెప్పవచ్చు.
మరోవైపు.. తిరుగుముఖం పట్టిన రుతుపవనాలు గంగా నది మైదాన భూముల మీదుగా బంగాళాఖాతంలో తిరిగి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలో అవి ఈశాన్యం నుంచి తిరోగమనం చెందడం వల్ల వీటిని ‘ఈశాన్య రుతుపవనాలు’గా పేర్కొంటారు.
సాధారణం కంటే 8 రోజులు ఆలస్యంగా..
ఇదిలావుంటే, మరోవైపు తుపాను ప్రభావంతో కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈసారి ఉపసంహరణ సాధారణం కంటే 8 రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. కాలానుగుణ ఉపసంహరణ ప్రకటన వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి.
తుఫానులు ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, దక్షిణ ఛత్తీస్‌గఢ్, తీరప్రాంత తమిళనాడు, ఉత్తర ఒడిశాలో ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉంది. గత కొన్ని రోజులుగా వాతావరణ శాఖ అందించిన రిపోర్టు ప్రకారం, సెప్టెంబర్ 29 శుక్రవారం నాటికి ఉత్తర అండమాన్ సముద్రం మీద తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. ఇది 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనంగా మారుతుంది.
రుతుపవనాల కాలం ముగుస్తున్న సమయంలో..
రుతుపవనాల ఆధారంగానే వచ్చే వర్షపాతంలో 80 శాతం వరకు నమోదవుతున్నాయి. మిగిలిన వర్షపాతం అకాల వర్షాలు, అల్పపీడన, తుఫాన్ ప్రభావంతో కురుస్తుంటాయి. కానీ రుతుపవనాల కాలం ముగుస్తున్న సమయంలో కేరళ 100 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది క్కేరళలో సాధారణ వర్షపాతం నిరాశపరిచింది. మే నెల నుంచి సెప్టెంబర్ వరకు 1,985 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది.
అయితే కేవలం 1,231 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అంటే ఇంకా 38 శాతం లోటు ఉంది. ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే. ఈలోపు ఇంతశాతం వర్షపాతం నమొదయ్యే అవకాశాలు లేవని అంటున్నారు వాతావరణ నిపుణులు. గతంలో 1976లో రుతుపవనాలు కేరళ ర్రాష్టాన్ని ఇబ్బంది పెట్టాయి. మిగిలిన వర్షపాతం మూడు రోజుల్లోపు కురిసే అవకాశం 50 శాతం మాత్రమే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. ఇప్పటివరకు నమోదైన గణాంకాల్లో రాష్ట్రం 1,918లో 1,223 మి.మీ.ల అతి తక్కువ నైరుతి రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయి.
చివరిసారిగా 1976లో..
కెరళ రాష్ట్రం చివరిసారిగా 1976లో ఇంత భయంకరమైన రుతుపవనాల సీజన్‌ను కనిపించింది. అదే సమయంలో 1,296 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సందేహాస్పదమైన రికార్డును నెలకొల్పకుండా ఉండటానికి.. ఇప్పుడు రాష్ట్రంలో కేవలం నాలుగు రోజుల్లో 65 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. అయితే, వాతావరణ నిపుణులు ఆశాజనకంగా లేరు.. దీనికి 50 శాతం మాత్రమే వర్షాపాతం రికార్డు అయ్యింది. చరిత్రలో రుతుపవనాల నమోదు ఇంత తక్కువ ఎన్నడూ లేదు. కేరళ రాష్ట్రం 1,223 మి.మీ.ల అత్యంత చెత్త నైరుతి రుతుపవనాలు నమోదు అయ్యాయి. ఇటీవల 2016 లో రాష్ట్రం కరువు సంవత్సరాన్ని ప్రకటించినప్పుడు.. నైరుతి రుతుపవనాల సీజన్లో 1,352 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా రుతుపవనాలు నమోదవుతాయని అంచనా ఉంది.
కేరళ కరువుతో గడ్డు పరిస్థితులను..
ఆ సందర్భంలో కూడా 1,352 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2023 జూన్ నెలలో మొదలైన రుతుపవనాలు అత్యంత బలహీనమైనవి కావడంతో సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం నమోదు కాలేదు. 2016 ఏడాది కరవు ర్రాష్టాన్ని ఏవిధంగా కష్టాలను మిగిల్చిందో.. 2023-2024 కూడా అలాంటి పరిస్థితులు తప్పవా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. 2016 లో కూడా ఎల్ నినో ప్రభావం రుతుపవనాలు, వర్షపాతం పై ప్రభావం చూపగా ఇప్పుడు కూడా అదే కారణంగా మళ్లీ కేరళను వర్షాభావం వెంటాడనుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2018 లో విలయతాండవం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని గ్రామాలు ఇంకా వందల సంఖ్యలోనే ఉండగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులను తట్టుకునేంత పరిస్థితి ఉందా అని అంటే సమాధానం అంత సులువుగా రాదని చెబుతున్నారు అక్కడి ప్రజలు.
మరిన్ని జాతీయ వార్తల కోసం