AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ గుర్తించిన ఆ బ్యాంకులు ఏవంటే..

భారతదేశంలో మీ డబ్బు భద్రతకు ఆర్‌బిఐ (RBI) మూడు అత్యంత సురక్షితమైన బ్యాంకులను గుర్తించింది. అవి ఎస్‌బిఐ (SBI), హెచ్‌డిఎఫ్‌సి (HDFC), ఐసిఐసిఐ (ICICI) బ్యాంకులు. వీటిని 'దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు' (D-SIB) అంటారు. ఇవి ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు, అవి ఎప్పటికీ విఫలం కావని ఆర్‌బిఐ హామీ ఇస్తుంది. మీ పొదుపు మరియు పెట్టుబడులు ఈ బ్యాంకులలో పూర్తిగా సురక్షితం.

మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ గుర్తించిన ఆ బ్యాంకులు ఏవంటే..
India Safest Banks
Jyothi Gadda
|

Updated on: Dec 05, 2025 | 9:28 PM

Share

సాధారణంగా ప్రజలు తమ డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి, లేదా ఫిక్స్‌ డిపాజిట్‌, పొదుపు చేయడానికి బ్యాంకులపై ఆధారపడతారు. అందువల్ల డబ్బు ఆదా చేయడానికి లేదా ఏదైనా ఒక రుణం తీసుకోవడానికి ఏ బ్యాంకు సురక్షితమైనది. నమ్మదగినదో తెలియక చాలా మంది అయోమయంలో పడుతుంటారు.. కానీ, ఈ సమస్య ఇకపై ఉండదు. ఎందుకంటే RBI డబ్బును పెట్టుబడి పెట్టడానికి దేశంలోని 3 సురక్షితమైన బ్యాంకుల గురించి సమాచారాన్ని వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారతదేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ దేశంలో అత్యంత సురక్షితమైన బ్యాంకులుగా పేర్కొనబడ్డాయి. బ్యాంకింగ్ పరిభాషలో ఈ బ్యాంకులను దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (D-SIBలు) అని పిలుస్తారు. ఈ మూడు బ్యాంకులు భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కావు. దివాళా తీయవు అని RBI పేర్కొంది. ఎందుకంటే ఈ బ్యాంకులు పెద్దవి. అవి ఏదైనా నష్టాన్ని ఎదుర్కొంటే సామాన్యులు ఏ విధంగానూ డబ్బును పొగోట్టుకునే అవకాశం ఉండదు.

మీలో చాలా మంది ప్రభుత్వ బ్యాంకులు సురక్షితమైనవని అనుకోవచ్చు. కానీ RBI జాబితాలోని 3 బ్యాంకులలో రెండు ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఈ మూడు బ్యాంకులు దేశ GDPకి గణనీయంగా దోహదపడతాయి. ఒక చిన్న తప్పు కూడా స్టాక్ మార్కెట్, సామాన్య ప్రజల పెట్టుబడులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఈ బ్యాంకులు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే, RBI, భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిర్ణయించాయి. అందువల్ల మీ డబ్బు ఈ 3 బ్యాంకులలో ఉంటే, అది పూర్తిగా సురక్షితం.

ఇవి కూడా చదవండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ మూడు బ్యాంకులు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ నగదు నిల్వలు లేదా మూలధనాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. దీనిని కామన్ ఈక్విటీ టైర్ 1 (CET 1) అని అంటారు. ఇది సంక్షోభ సమయాల్లో ఉపయోగించగల అత్యవసర నిధి. అందువల్ల ఈ బ్యాంకుల పనితీరుపై లేదా పౌరుల డబ్బుపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి, ఈ బ్యాంకుల్లో డబ్బు ఉండటం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి