AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!

Phani CH
|

Updated on: Dec 05, 2025 | 7:33 PM

Share

తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు హోరాహోరీ పోరు సాగుతోంది. ఈసారి ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడంతో పాటు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారు సైతం బరిలోకి దిగుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని అమెరికా నుండి వచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. ఆమెను గ్రామస్థులు ఆదరిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. పల్లె పోరులో సర్పంచ్ పీఠాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో గెలుపు గుర్రాలను సర్పంచ్ అభ్యర్థులుగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రిజర్వేషన్లకు తగ్గట్లుగా అవసరమైన అభ్యర్థులు దొరక్క తంటాలు పడుతున్నాయి. ఇంకొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అవుతున్నాయి. మూడు దశల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో అనేక విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ముగ్గురు సంతానం ఉన్నా పోటీకి అర్హత ఉండడంతో ఇన్నాళ్లు బరిలో లేని వారు ఇప్పుడు సై అంటున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారు అప్పటికప్పుడు లగేజి సర్దేసుకుని స్వగ్రామంలో వాలిపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచి ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్‌ పదవి కోసం ఏకంగా అమెరికా నుంచి వచ్చి నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన కమతం నందిని అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లోనామినేషన్ వేశారు. నందిని, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. వాళ్లు అమెరికాలో స్థిరపడటంతో ఆరేళ్ల క్రితం నందిని ఆ దేశానికి వెళుతూ వస్తున్నారు. కొన్ని నెలల క్రితం కూతురి డెలివరీ కోసం అమెరికా వెళ్లారు. పంచాయతీ ఎన్నికల్లో లట్టుపల్లి గ్రామ సర్పంచ్ సీటును.. సుదీర్ఘ కాలం తర్వాత జనరల్ మహిళకు కేటాయించారు. అటు ముగ్గురు పిల్లల నిబంధన కూడా ఎత్తివేయడంతో అమెరికా నుంచి లట్టుపల్లి గ్రామానికి వచ్చి సర్పంచ్ గా నామినేషన్ వేసింది నందిని. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తనను గెలిపించాలని గ్రామస్థులను కోరారు. ఇక బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ పెరిగింది. అమెరికా నుంచి వచ్చి పోటీ చేస్తున్న కమతం నందినిని గ్రామస్థులు ఆదరిస్తారా లేక తిరిగి పంపిస్తారా వేచి చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా

రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు