స్మార్ట్ వాచ్లు హృదయ స్పందన, నిద్ర వంటి అనేక వివరాలను అందిస్తాయి. అయితే, చిన్న స్క్రీన్ల వల్ల కళ్లపై ఒత్తిడి, చెమట, బ్యాక్టీరియాతో చర్మ సమస్యలు, నిద్రకు భంగం కలిగే అవకాశముంది. కంటి సమస్యలకు 20-20-20 నియమం పాటించడం, వాచ్ను శుభ్రంగా, వదులుగా ధరించడం, నిద్రపోయే ముందు తీసివేయడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.