శీతాకాలంలో వేడి టీ, కాఫీలు ఎక్కువగా తాగడం సాధారణం. అయితే, నిపుణుల ప్రకారం వీటిని అతిగా సేవిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్‌కు మించకుండా నాలుగు కప్పుల టీ లేదా కాఫీ తాగాలి. అధిక కెఫిన్ వల్ల అల్సర్లు, రక్తహీనత, దంత ఎనామిల్ క్షీణత, పొడి చర్మం వంటివి రావచ్చు. ఖాళీ కడుపుతో తాగడం మంచిది కాదు.