- Telugu News Photo Gallery Assam black tea, Kashmiri saffron, Bhagavad Gita among PM Modi's gifts to Putin
పుతిన్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్స్.. భారత్-రష్యా స్నేహానికి గుర్తుగా ఇచ్చిన బహుమతులు ఇవే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చారు. భారతీయ హస్తకళలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఆరు ప్రత్యేకమైన బహుమతులను అందించారు. ఈ బహుమతులు కేవలం వస్తువులు మాత్రమే కాక భారత్-రష్యా దేశాల మధ్య ఉన్న గాఢమైన స్నేహం, భాగస్వామ్యం, ఉమ్మడి గౌరవాన్ని సూచిస్తున్నాయి.
Updated on: Dec 05, 2025 | 9:51 PM

శ్రీమద్ భగవద్గీత: హిందువుల పవిత్ర గ్రంథం శ్రీమద్ భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదించారు. దానినే మోదీ పుతిన్‌కు అందజేశారు. ఇది ధర్మం, కర్మ, శాంతి గురించి చెబుతుంది. ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేలా, ఈ రష్యన్ అనువాదాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు.

అస్సాం బ్లాక్ టీ: సారవంతమైన బ్రహ్మపుత్ర మైదానాల్లో పండించే ఈ టీ చాలా ప్రత్యేకమైనది. దీనికి మంచి రుచి, రంగు ఉంటుంది. 2007లో GI ట్యాగ్ పొందిన ఈ టీ, ప్రాంతీయ వారసత్వాన్ని, సాంప్రదాయ ప్రాసెసింగ్‌కు ప్రసిద్ధి. ఈ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వెండి టీ సెట్:అదిరిపోయే డిజైన్‌లతో చెక్కిన ఈ టీ సెట్ పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ కళాత్మకతను ప్రతిబింబిస్తుంది. భారత్, రష్యా దేశాల్లో టీ తాగడం అనేది స్నేహాన్ని, కబుర్లను పంచుకోవడాన్ని సూచిస్తుంది. ఈ సెట్ ఇరు దేశాల స్నేహానికి గుర్తుగా ఉంటుంది.

సిల్వర్ హార్స్: ఈ వెండి గురాన్ని మహారాష్ట్ర కళాకారులు చేతితో తయారు చేశారు. భారతదేశ లోహపు హస్తకళల సంప్రదాయాల గొప్పదనాన్ని ప్రదర్శిస్తుంది. భారత్ - రష్యాలో గుర్రం అంటే గౌరవం, ధైర్యం. ఇది రెండు దేశాల భాగస్వామ్యం ఎప్పుడూ ముందుకు సాగుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణ.

మార్బుల్ చెస్ సెట్: చెస్ సెట్‌ను ఆగ్రా నుండి తెచ్చిన, పాలరాయి, రంగు రాళ్లు ఉపయోగించి చేతితో తయారు చేశారు. ఈ సెట్ ఆగ్రా ప్రాంతపు అద్భుతమైన రాతి హస్తకళను చూపుతుంది. ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆడటానికి కూడా ఉపయోగపడుతుంది.

కాశ్మీరీ కుంకుమ పువ్వు: కాశ్మీర్ ఎత్తైన ప్రాంతాలలో పండించే ఈ కుంకుమ పువ్వును స్థానికంగా కాంగ్ లేదా జాఫ్రాన్ అని పిలుస్తారు. దీనికి అద్భుతమైన రంగు, రుచి, వాసన ఉంటాయి. దీనిని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. ఇది మన సంస్కృతిలో, వంటకాల్లో చాలా ముఖ్యం. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.




