- Telugu News Photo Gallery Business photos Physical Gold vs Digital Gold: Which Investment is Best for You?
డిజిటల్ గోల్డ్ vs ఫిజికల్ గోల్డ్.. ఏది కొంటే లాభం? దేని ప్రత్యేకత ఏంటి..?
బంగారం కొనుగోలుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. పెట్టుబడిగా భావించి కొనేవారికి ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ మధ్య ఎంపిక ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ అలంకరణకు, భద్రతకు మంచిది కానీ ఖరీదైనది, దొంగతనం భయం ఉంటుంది. డిజిటల్ గోల్డ్ పెట్టుబడికి సరైనది, తక్కువ ఖర్చుతో కూడుకున్నది, భద్రత ఎక్కువ.
Updated on: Dec 06, 2025 | 12:55 AM

చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కాస్త డబ్బు పొదుపు చేసుకొని బంగారం కొంటే భవిష్యత్తులో ఒక భరోసా ఉంటుందని అనుకుంటారు. పైగా ఇప్పుడు బంగారం ధర పెరుగుదల చూసి.. కచ్చితంగా ఎంతో కొంత కొని పెట్టుకుంటేనే మంచిదని అనుకుంటున్నారు.

ఎందుకంటే భవిష్యత్తులో మరింత ధర పెరిగే అవకాశం ఉందని వారి ఆలోచన. అయితే మరి బంగారాన్ని అలంకరణ కోసం మాత్రమే కాకుండా పెట్టుబడిగా భావించి కొనేవారికి ఫిజికల్ గోల్డ్ కొంటే మంచిదా? లేక డిజిటల్ గోల్డ్ కొంటే మంచిదా అనేది చూద్దాం..

ఫిజికల్ గోల్డ్ అంటే మన చేతిలో ఉండే బంగారం. అంటే బంగారు ఆభరణాలు, బిస్కెట్లు లాంటివి. ఈ విధంగా బంగారం కొంటే వాటిని మనం అలంకరించుకోవచ్చు, అవసరం అయితే తాకట్టు పెట్టి అవసరానికి డబ్బు కూడా తీసుకోవచ్చు.

అయితే ఫిజికల్ గోల్డ్ ధర ఎక్కువ ఎందుకంటే దీనికి తయారీ ఛార్జీలు, జీఎస్టీ, తరుగు వంటివి అదనంగా ఉంటాయి. అలాగే దొంగతనం భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో బంగారం ఉంటే దొంగలు ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. కానీ, డిజిటల్ గోల్డ్‌కు ఇలాంటి సమస్యలు ఉండవు.

డిజిటల్ గోల్డ్ కాస్త ధర తక్కువ. ఎందుకంటే వీటిపై మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటివి ఉండవు. పైగా చోరీ జరుగుతుందనే భయం అసలు ఉండదు. అలా అని ఈ బంగారం మన చేతుల్లో ఉండదు. కేవలం దాని విలువను డిజిటల్ రూపంగా ఉంటుంది. డిజిటల్ గోల్డ్‌లో ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టినా ఒక్క తులం కూడా ఒంటిపై వేసుకోలేం. అయితే అలంకరణతో పాటు భవిష్యత్తులో భద్రత కోరుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనడం బెస్ట్. లేదు కేవలం పెట్టుబడి కోసమే అనుకుంటే డిజిటల్ గోల్డ్ బెస్ట్ ఆప్షన్.




