New Car: కొత్త కారు కొంటున్నారా..? ఈ చిన్న పని చేస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు
కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆశ చాలామందికి ఉంటుంది. తమ కష్టార్జితం మొత్తాన్ని పొదుపు చేసుకుని కారు కొనుగోలు చేస్తూ ఉంటారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కారు కొంటే మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. అదెలానో ఇందులో తెలుసుకోండి.
Updated on: Dec 06, 2025 | 11:48 AM

సొంత కారు కొనుక్కోవాలనేది సామాన్య ప్రజలకు ఒక కలగానే ఉంది. ఉద్యోగం, వ్యాపారులు చేసేవారు లోన్లు తీసుకుని కార్లు కొనుగోలు చేస్తూంటారు. మంచి కారు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో లక్షలకు లక్షలు ఖర్చు పెడతారు. అత్యాధునిక ఫీచర్లు ఉంటాయనే కారణంతో రూ.10 లక్షలకుపైన ధర ఉండే కార్లను కొనుగోలు చేస్తుంటారు.

రూ.10 లక్షలకుపైబడి కార్లను కొనుగోలు చేస్తే 1 శాతం టీసీఎస్ కట్ అవుతుంది. అంటే రూ.10 లక్షలు ఖర్చు పెట్టి కారు కొంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్(TCS) రూపంలో రూ.10 వేలు కట్టా్ల్సి ఉంటుంది . ఇక రూ.30 లక్షల కారు కొంటే రూ.30 వేలు పడుతుంది.

అయితే టీసీఎస్ అనేది అదనపు పన్ను అని, ఇది మనకు తిరిగి రాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ డబ్బులు తిరిగి పొందే అవకాశముంది. ఇందుకు కారు కొనుగోలు చేసేటప్పుడు డీలర్ వద్ద ఫారం 27డీ తీసుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేసే టైమ్‌లో ఫారం 26ఏఎస్ చెక్ చేసుకోవాలి. ఇందులో మీరు చెల్లించిన టీసీఎస్ ఉంటుంది.

మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేసే సమయంలో దీనిని క్లెయిమ్ చేసుకుంటే మీకు రీ ఫండ్ వస్తుంది. మీరు చెల్లించాల్సిన పన్నుల కంటే మీరు చెల్లించిన టీసీఎస్ ఎక్కువగా ఉంటే అదనపు సొమ్మును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. మీరు కారు కొనుగోలు చేసేటప్పుడు టీసీఎస్ సర్టిఫికేట్‌ను తీసుకుని భద్రంగా దాచుకోండి. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోండి.

చాలామందికి ఈ విషయాలు తెలియక క్లెయిమ్ చేసుకోరు. దీని వల్ల చాలా నష్టపోతుంటారు. అందుకే రూ.10 లక్షలకుపైగా ధర పెట్టి కారు కొనుగోలు చేసేవారు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోండి. అప్పుడే మీకే డబ్బులు ఆదా అవుతాయి.




