AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డిజిటల్ పేమెంట్స్‌లో హైదరాబాద్ రికార్డ్.. గత ఏడాది కంటే..

డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో హైదరాబాద్ సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది యూపీఐ ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగాయి. మిగతా నగరాలతో పోలిస్తే నగరంలో యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఓ సర్వే ఆధారంగా ఈ వివరాలు బయటకొచ్చాయి.

Venkatrao Lella
|

Updated on: Dec 06, 2025 | 2:09 PM

Share
డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న  కేంద్ర ప్రభుత్వం... అన్ని రంగాల్లో టెక్నాలజీ అభివృద్దికి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరిగిపోయింది. యూపీఐ యాప్స్ రాకతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. ఇంతకముందు నెట్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించేవారు. అయితే యూపీఐ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతీఒక్కరి ఫోన్లలో ఏదోక యూపీఐ యాప్ ఉంటుంది.

1 / 5
ఈ క్రమంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌లో హైదరాబాద్ రికార్డ్ సృష్టించింది. దక్షిణ భారతదేశంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో హైదరాబాద్ ముందంజలో నిలిచింది. యూపీఐ ట్రాన్సాక్షన్లలో గత సంవత్సరంతో పోలిస్తే 33 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  వ్యాపారులు యూపీఐ ద్వారా నగదును స్వీకరించడం వల్ల ట్రాన్సాక్షన్లు పెరిగాయి. డిజిటల్ లావాదేవీల పట్ల ప్రజలకున్న విశ్వాశాన్ని ఇది సూచిస్తుందని అంటున్నారు.

2 / 5
120 నగరాల్లో 6 వేలమందికిపైగా కస్టమర్లపై హౌ అర్బన్ ఇండియా పేస్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఆధారంగా మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో ముందు వరుసలో ఉంది. దక్షిణ భారతదేశంలో పెద్ద, మధ్య తరహా నగరాల్లో యూపీఐ వినియోగం పెరుగుతుందని తేలింది. నగరాల్లో  52 శాతం లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతుండగా... 33 శాతమే ఆఫ్‌లైన్ ద్వారా నడుస్తున్నాయి.

3 / 5
హైదరాబాద్ ప్రజలు డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వాలెట్లు, క్రెడిట్ కార్డులు వంటివి ఉపయోగిస్తున్నారు. వేగంగా, సులువుగా, సురక్షితంగా ట్రాన్సాక్షన్లు జరిపేందుకు ఇవి ఉయోగపడుతున్నాయి.  డిజిటల్ ట్రాన్సాక్షన్లపై పెరుగుతున్న నమ్మకం, UPI వినియోగంలో నిరంతర వృద్ధితో  తెలంగాణ నగదు రహిత వాణిజ్యం వైపు వేగంగా వెళ్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

4 / 5
ఇండియాలోనే డిజిటల్ చెల్లింపుల విషయంలో హైదరాబాద్‌ను ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక  టైర్ 2, టైర్ 3 నగరాల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

5 / 5