TS TET 2023 Results: రేపే తెలంగాణ టెట్‌- 2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు..

TS TET 2023 Results: రేపే తెలంగాణ టెట్‌- 2023 ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి
TS TET 2023 Results
Follow us

|

Updated on: Sep 26, 2023 | 8:45 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ఫలితాలు రేపు (సెప్టెంబర్‌ 27) విడుదల చేయనున్నారు. ఇప్పటికే టెట్‌ ప్రాథమిక కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తుది ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను కూడా బుధవారం విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే ఫలితాలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెట్‌కు హాజరైన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చన్నారు.

కాగా టెట్‌ పరీక్ష పేపర్‌–1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక పేపర్‌ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. టెట్‌ ఫలితాల ప్రకటన అనంతరం అందులో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసే వీలుంటుంది. ఈ కారణంగానే టెట్‌ ఫలితాలను త్వరితగతిన ప్రకటించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) 2023 ఫలితాలు విడుదల

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సోమవారం (సెప్టెంబర్ 25) విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో సీటెట్‌ 2023 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 29 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్‌ – 1కు 15 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌ – 2కు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1 రాసిన వారు 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. పేపర్ 2 రాసిన వారు 6 నుంచి 8 తరగతులకు బోధించేందుకు అర్హత సాధిస్తారు. కాగా సీటెట్‌లో అర్హత సాధించిన వారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?
ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత ఆదాయపు పన్ను నోటీసు వస్తే ఏం చేయాలి?
రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న రష్మిక మందన్న..
రవితేజ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న రష్మిక మందన్న..
5 లక్షల మంది మృతికి, రాబందుల సంఖ్య తగ్గడానికి కారణమేంటి?
5 లక్షల మంది మృతికి, రాబందుల సంఖ్య తగ్గడానికి కారణమేంటి?
ఈ ఆలయంలో గంట కొట్టడం నిషేధం.. ఎందుకంటే
ఈ ఆలయంలో గంట కొట్టడం నిషేధం.. ఎందుకంటే
భారత్‌ తన బంగారాన్ని లండన్‌లో ఎక్కువ కాలం ఎందుకు ఉంచింది!
భారత్‌ తన బంగారాన్ని లండన్‌లో ఎక్కువ కాలం ఎందుకు ఉంచింది!
'అయ్యో కొడుకా.. ఎంత పని చేశావ్.!' మూడేళ్లగా ప్రేమించాడు..
'అయ్యో కొడుకా.. ఎంత పని చేశావ్.!' మూడేళ్లగా ప్రేమించాడు..
కీటో డైట్ తో ప్రాణాపాయం! అధ్యయనంలో షాకింగ్ విషయాలు
కీటో డైట్ తో ప్రాణాపాయం! అధ్యయనంలో షాకింగ్ విషయాలు
అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర చుట్టమల్లె.
అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవర చుట్టమల్లె.
మన దేశంలో ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా లేని ప్రాంతం ఏదో తెలుసా?
మన దేశంలో ఒక్క ప్రైవేటు పాఠశాల కూడా లేని ప్రాంతం ఏదో తెలుసా?
స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే.!
స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే.!