AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ పరిశ్రమలో మరో విషాదం.. లెజెండరీ డైరెక్టర్‌ కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) ఆదివారం (సెప్టెంబర్ 24) కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోన్న ఆయన చికిత్స పొందుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ కేజీ జార్జ్‌ మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. పలువరు సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేజీ జార్జ్‌ అంత్యక్రియలు..

సినీ పరిశ్రమలో మరో విషాదం.. లెజెండరీ డైరెక్టర్‌ కన్నుమూత!
Filmmaker KG George
Srilakshmi C
|

Updated on: Sep 25, 2023 | 9:02 AM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) ఆదివారం (సెప్టెంబర్ 24) కన్నుమూశారు. గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోన్న ఆయన చికిత్స పొందుతున్న ఆయన కేరళ కక్కనాడ్‌లోని వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇప్పటికే పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ కేజీ జార్జ్‌ మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్బ్రాంతికి గురిచేసింది. పలువరు సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేజీ జార్జ్‌ అంత్యక్రియలు సెప్టెంబర్ 26 (మంగళవారం) వృద్ధాశ్రమంలోనే నిర్వహించే అవకాశం ఉంది.

1976లో స్వప్నదానం సినిమాతో దర్శకుడిగా జార్జ్ ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్‌గా తన ఫస్ట్‌ మువీ స్వప్నదానం సినిమాకు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘ఉల్కడల్’ (1979), మేళా (1980), యవనిక (1982), లేఖుడే మరణం ఓరు ఫ్లాష్‌బ్యాక్ (1983), ఆడమింటే వారియెల్లు (1983), పంచవడి పాలెం (1984), ఇరకల్ (1986), మట్టోరల్ (1988) లాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ మువీలు తెరకెక్కాయి. మలయాళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేరళ ప్రభుత్వం 2015లో జైసీ డేనియల్ అవార్డుతో సత్కరించింది. డైరెక్టర్‌ జార్జ్‌ కేజీ జార్జ్ కొత్త ఫిల్మ్ మేకింగ్ స్కూల్‌ను కూడా స్థాపించారు. ఈ ఫిల్మ్‌ స్కూ్‌ల్‌ నుంచి బయటకు వచ్చిన ఎందరో నటీనటులు ఇండస్ట్రీలో గొప్ప నటులుగా నిలదొక్కుకున్నారు.

జార్జ్‌ వ్యక్తిగత వివరాలకొస్తే.. 1946, మే 24వ తేదీన కేరళలోని పతనం తిట్టలో జార్జ్‌ జన్మించారు. పూణేలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో డిప్లొమా పూర్తి చేశాడు. సినిమాల పట్ల ఆయనకున్న మక్కువ వల్ల చిత్రనిర్మాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన దర్శకుడు, లెజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ రాము కరియాట్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్షర్‌గా చేరి కెరీర్‌ ప్రారంభించారు. జార్జ్‌ సినీ ఇండస్ట్రీలో సుమారు 26 సంవత్సరాలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. 1977లో ఆయన మలయాళ సింగర్‌ సెల్మా జార్జ్‌ను చెన్నైలో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆయన ఓల్డేజ్ హోమ్ లో ఎందుకు ఉంటున్నారంటూ పలువురు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.