Bigg Boss 7 Telugu: ఎలిమినేట్ అయినా కూడా వదల్లేదు.. దామిని శివాజీ మధ్య చిన్నపాటి ఫైట్.. ఇంటికెళ్ళు అంటూ..

మూడు వారాల్లో మొదటి వారం కిరణ్ రాథోడ్ , రెండో వారంలో షకీలా ఇక ఇప్పుడు మూడో వారంలో ఊహించని విధంగా సింగర్ దామని ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచేసింది. దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని మొదటి నుంచి ప్రేక్షకుల్లో టాక్ ఉంది. ఈ అందాల సింగర్ బిగ్ బాస్ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. కానీ ముందే దామిని హౌస్ మెట్ గా కన్ఫర్మ్ కాదు అని చెప్పారు నాగ్. ఆడి గెలిస్తేనే హౌస్ మెట్ గా కన్ఫామ్ అవుతావు అని తెలిపారు. కానీ అయి అమ్మడు మూడో వారం లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

Bigg Boss 7 Telugu: ఎలిమినేట్ అయినా కూడా వదల్లేదు.. దామిని శివాజీ మధ్య చిన్నపాటి ఫైట్.. ఇంటికెళ్ళు అంటూ..
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 25, 2023 | 9:30 AM

బిగ్ బాస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతుంది. హౌస్ లో 14 మంది నుంచి ఇప్పటికే ముగ్గురు బయటకు వచ్చేశారు. అలాగే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫామ్ అయ్యారు. ఇక హౌస్ లో ఎనిమిది మంది మాత్రమే నామినేషన్స్ కి పోటీ పడుతారు. మూడు వారాల్లో మొదటి వారం కిరణ్ రాథోడ్ , రెండో వారంలో షకీలా ఇక ఇప్పుడు మూడో వారంలో ఊహించని విధంగా సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచేసింది. దామిని సేఫ్ గేమ్ ఆడుతుందని మొదటి నుంచి ప్రేక్షకుల్లో టాక్ ఉంది. ఈ అందాల సింగర్ బిగ్ బాస్ హౌస్ లో మూడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. కానీ ముందే దామిని హౌస్ మెట్ గా కన్ఫర్మ్ కాదు అని చెప్పారు నాగ్. ఆడి గెలిస్తేనే హౌస్ మెట్ గా కన్ఫామ్ అవుతావు అని తెలిపారు. కానీ అయి అమ్మడు మూడో వారం లోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ ఆడించి సందడి చేశారు.

హీరో రామ్ పోతినేని బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన రామ్ పోతినేని తన స్కంద మూవీ కొత్త ట్రైలర్ ను నాగ్ కు చూపించారు. ట్రైలర్ చూసి నాగార్జున ఫిదా అయ్యారు. ఇక హౌస్ లో ఉన్న వారితో ఓ డాన్స్ కాంపిటేషన్ పెట్టారు. హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్ ఆడించారా. ఈ గేమ్ కు రామ్ ను జడ్జ్ గా వ్యవహరించారు. ఆ తర్వాత తిరిగి ఎలిమినేషన్ ప్రకియను కంటిన్యూ చేశారు నాగ్.

అమర్ దీప్, శుభా శ్రీ , దామిని నామినేషన్స్ లో ఉండగా ముందుగా అమర్ దీప్ సేవ్ అయ్యాడు. దాంతో మనోడు పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేశాడు. ఇప్పటి వరకు మైల్డ్ గా ఆడాను.. ఇప్పటి నుంచి వైల్డ్ గా ఆడతా అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో నాగ్ నువ్వు రవితేజ ఫ్యాన్ వి గుర్తుపెట్టుకో అని ప్రోత్సహించాడు. ఆ తర్వాత శుభా శ్రీ, దామినిని యాక్టివిటీ రూమ్ కు పిలిచి ఓ ఇద్దరి ముందు బోట్ బొమ్మలను ఉంది ఎవరి బొమ్మ అయితే పేలిపోతుందో వారు ఎలిమినేట్ అయ్యినట్టు అని తెలిపాడు. దామిని బోట్ బ్లాస్ట్ అవ్వడంతో ఆమె ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన దామినికి తన జర్నీ చూపించాడు నాగ్. అలాగే తన గురించి శివాజీ ఏమన్నాడో కూడా చూపించారు. ఆతర్వాత హౌస్ మెంబర్ ఫొటోలతో ఉన్న బెలూన్ ను పగలకొట్టి వారికి ఒకొక్క సలహా ఇవ్వాలని అన్నారు. దాంతో శివాజీతో వాదించిది దామిని. మీరు నన్ను సేఫ్ గేమ్ ఆడుతుంది అని అన్నారు. అది నాకు నచ్చలేదు అని చెప్పింది. అలాగే ఆయన కొంతమందికి ఫెవరెట్ గా ఆడుతున్నారని.. అందరితో కలిసి ఆడాలని అంది. దానికి శివాజీ కూడా గట్టిగానే రిప్లే ఇచ్చాడు.  శివాజీ దామిని చెప్పినదానికి ఒప్పుకోలేదు. ఇంటికెళ్లి నా గేమ్ చూడు అప్పుడు కూడా నీకు ఇదే అనిపిస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా అని అన్నారు శివాజీ. ఇలా చివరిలో కూడా ఇద్దరి మధ్య వాదన జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.