AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Running Train: కదులుతోన్న రైలు ఆపి హీరో అయిన పదేళ్ల బాలుడు.. సమయ స్ఫూర్తితో వందల ప్రాణాలు కాపాడిన వైనం

ఐదో తరగతి చదువుతోన్న పదేళ్ల బాలుడు చూపిన సమయస్ఫూర్తి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్‌ 22) ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..  పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామానికి చెందిన ముర్సెలీన్ (10) అనే విద్యార్ధి 5వ తరగతి చదువుతున్నాడు..

Running Train: కదులుతోన్న రైలు ఆపి హీరో అయిన పదేళ్ల బాలుడు.. సమయ స్ఫూర్తితో వందల ప్రాణాలు కాపాడిన వైనం
5th Class Boy Mashaldah
Srilakshmi C
|

Updated on: Sep 24, 2023 | 8:54 AM

Share

కలకత్తా, సెప్టెంబర్‌ 24: ఐదో తరగతి చదువుతోన్న పదేళ్ల బాలుడు చూపిన సమయస్ఫూర్తి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఓ రైలును పెను ప్రమాదం నుంచి తప్పించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్‌ 22) ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా హరిశ్చంద్రపూర్‌ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీలోని కరియాలి గ్రామానికి చెందిన ముర్సెలీన్ (10) అనే విద్యార్ధి 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం (సెప్టెంబర్‌ 22) మధ్యాహ్నం బాలుడు సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అప్పటికే మాల్దా జిల్లాలో జోరు వర్షాలు కురుస్తుండటంతో వాగులు, చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో బాలుడు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ చోట రైల్వే ట్రాక్‌ కింద భూమి వానకు కొట్టుకుపోయి గుంత ఏర్పడింది. సరిగ్గా అదే సమయానికి అటుగా అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ వేగంగా దూసుకు రావడాన్ని బాలుడు గమనించాడు. వెంటనే తాను ధరించిన ఎరుపు రంగు టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలు నడిపే అధికారులకు సిగ్నల్‌ ఇచ్చాడు.

లోకోపైలట్‌ గమనించి సకాలంలో రైలును ఆపాడు. రైలు నుంచి కిందికి దిగిన లోకోపైలట్‌ బాలుడి వద్దకు చేరుకుని రైలును ఎందుకు ఆపాడో అడిగి తెలుసుకున్నాడు. అక్కడ దెబ్బ తిన్న రైల్వే ట్రాక్‌ను చూసిన గార్డు ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు బాలుడిని అభినందించాడు. గార్డు వెంటనే భాలూకా రోడ్ స్టేషన్ జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వర్షాలకు పట్టాల కింద మట్టి, కంకర కొట్టుకుపోయినట్లు తెలిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు లైన్‌కింద ఉన్న రంధ్రాన్ని పూడ్చారు. అనంతరం గంటన్నర ఆలస్యంగా రైలు బయలుదేరింది. పాడైన ట్రాక్‌ను గుర్తించి రైలును ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడినందుకు బాలుడు ముర్సెలీన్ షేక్‌ స్థానికంగా హీరోగా మారాడు. బాలుడి సాహసోపేతమైన, సమయానుకూల చర్యకు ముర్సెలీమ్‌ పేరును అవార్డు కోసం సిఫార్సు చేస్తామని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అధికారులు సిఫార్సు చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..