Cab Driver: నిముషాల వ్యవధిలోనే కోటీశ్వరుడై పోయిన క్యాబ్‌ డ్రైవర్‌.. బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ

ఓ కారు డ్రైవర్‌ ఒక్కసారిగా కోటీశ్వరుడై పోయాడు. తన బ్యాంకు ఖాతాలో వంద, వెయ్యి కాదు ఏకంగంగా రూ.9 వేల కోట్లు జమవ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అది కలో.. నిజమో.. తెలుసుకునేందుకు వెంటనే తన స్నేహితుడికి ఖాతాకు రూ.21 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. కనీసం వెయ్యి రూపాయలు కూడా లేని తన బ్యాంకు అకౌంట్‌లో అంత పెద్దమొత్తంలో డబ్బు వచ్చిపడటంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. అయితే సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు యాజమన్యం అతనికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ ఘటన..

Cab Driver: నిముషాల వ్యవధిలోనే కోటీశ్వరుడై పోయిన క్యాబ్‌ డ్రైవర్‌.. బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ
Cab Driver Gets Rs 9000 Crore Deposit
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 22, 2023 | 7:16 AM

చెన్నై, సెప్టెంబర్ 22: ఓ కారు డ్రైవర్‌ ఒక్కసారిగా కోటీశ్వరుడై పోయాడు. తన బ్యాంకు ఖాతాలో వంద, వెయ్యి కాదు ఏకంగంగా రూ.9 వేల కోట్లు జమవ్వడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అది కలో.. నిజమో.. తెలుసుకునేందుకు వెంటనే తన స్నేహితుడికి ఖాతాకు రూ.21 వేలు ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. సెకన్లలో ఆ డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యింది. అంతే.. కనీసం వెయ్యి రూపాయలు కూడా లేని తన బ్యాంకు అకౌంట్‌లో అంత పెద్దమొత్తంలో డబ్బు వచ్చిపడటంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. అయితే సెకన్ల వ్యవధిలోనే బ్యాంకు యాజమన్యం అతనికి ఊహించని ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

చెన్నైలోని పళని నెయ్‌క్కారపట్టి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తీసుకుని డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్‌కుమార్ తన కారులో నిద్రిస్తుండగా అతని సెల్‌ ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రాజ్‌కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ.9,000 కోట్లు జమ అయ్యినట్లు ఎస్‌ఎంఎస్‌లో కనిపించింది. ఈ మెసేజ్‌ చూడగానే రాజ్‌కుమార్‌ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు. అంత డబ్బు తన అకౌంట్లోకి ఎలా వచ్చిందో తెలియక తికమకపడ్డాడు. అసలు 9 వేల కోట్ల రూపాయలంటే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా అతను ఊహించలేకపోయాడు.

తన బ్యాంకు ఖాతాలో కేవలం 105 రూపాయలే ఉండగా ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చాయా? అని సందేహించాడు. అసలు ఇది నిజమా.. కాదా అని తెలుసుకునేందుకు అదే రోజు రాజ్‌ కుమార్‌ తన స్నేహితుడికి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.21,000 బదిలీ చేశాడు. ఆ మొత్తాన్ని స్నేహితుడికి పంపిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 9 వేల కోట్ల రూపాయలు చేరడం నిజమేనని భావించి సంబరపడ్డాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మెయిన్‌ బ్రాంచ్‌ ఉన్న తూత్తుకుడి నుంచి రాజ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఓ పొరపాటు వల్ల అతని బ్యాంకు ఖాతాలో రూ.9,000 కోట్లు జమ అయ్యాయని వారు తెలిపారు. ఆ డబ్బును ఖర్చు చేయవద్దని బ్యాంకు యాజమాన్యం కోరింది. తదనంతరం అతని ఖాతా నుంచి మొత్తం నగదును వెనక్కి (డెబిట్‌) తీసుకుంది. అంతేకాకుండా తన స్నేహితుడికి పంపిన నగదును కూడా తిరిగి చెల్లించాలని బ్యాంకు యాజమన్యం సూచించింది. తమిళనాడు మెర్కెంటైల్ బ్యాంక్ పొరపాటు వల్ల లావాదేవీ జరిగిందని ఈ మేరకు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కుమార్‌ తరఫున న్యాయవాదులు చెన్నై టీనగర్‌లోని బ్యాంకు శాఖకు వెళ్లి మాట్లాడారు. దీంతో రాజ్‌ కుమార్‌ తన స్నేహితుడికి అతను పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా జేబులో చిల్లిగవ్వలేని సమయంలో హఠాత్తుగా వేల కోట్లు వచ్చిపడితే బాగుండు అని కలలో అనుకుంటుంటాం. కానీ అతని బ్యాంకు ఖాతాకు మాత్రం నిజంగానే వేల కోట్లు రావడంతో స్థానికంగా చర్చకు దారి తీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.