AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమానవీయ ఘటన: రూ.3 వేల అప్పు కట్టలేదనీ.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగింపు

అప్పుగా తీసుకున్న రూ.3 వేలు తిరిగి చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిని నగ్నంగా మార్చి, కర్రతో కొడుతూ వీధుల్లో ఊరేగించాడో వ్యక్తి. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమావారం (సెప్టెంబర్‌ 18) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు..

అమానవీయ ఘటన: రూ.3 వేల అప్పు కట్టలేదనీ.. నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగింపు
Noida vegetable vendor thrashed in UP
Srilakshmi C
|

Updated on: Sep 21, 2023 | 7:01 AM

Share

నోయిడా, సెప్టెంబర్‌ 21: అప్పుగా తీసుకున్న రూ.3 వేలు తిరిగి చెల్లించలేదని ఓ చిరు వ్యాపారిని నగ్నంగా మార్చి, కర్రతో కొడుతూ వీధుల్లో ఊరేగించాడో వ్యక్తి. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సోమావారం (సెప్టెంబర్‌ 18) చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడితోపాటు అతనికి సహకరించిన మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడా పరిధిలోని సెక్టార్‌ 88కి చెందిన అమిత్‌ అనే ఓ చిరు వ్యాపారి వెల్లుల్లి విక్రయంతో జీవనం సాగిస్తున్నాడు. నోయిడిలోని ఫేజ్‌2 మార్కెట్లో వ్యాపారం చేసుకునే వాడు. కొన్ని రోజుల క్రితం సుందర్‌ సింగ్‌ అనే కమీషన్‌ ఏజెంటు వద్ద వ్యాపారంలో పెట్టుబడి కోసం రూ.5,600 అప్పుగా తీసుకున్నాడు. అందులో బాధితుడు రూ.2,600 తిరిగి చెల్లించగలిగాడు. మిగిలిన నగదు చెల్లించలేకపోయాడు. వారం రోజులకుపైగా ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన కమీషన్‌ ఏజెంటు డబ్బు రికవరీ చేసుకోవడానికి సుందర్‌ సింగ్‌ మరికొందరు వ్యక్తులతో కలిసి అమిత్‌పై దాడి చేసేందుకు వెళ్లారు. అతను తన మద్ధతుదారులతో కలసి ఆ వ్యాపారిపై విరుచుకుపడ్డాడు. బాధితుడిని ఓ గదిలో బంధించి నగ్నంగా మార్చి చితకబాదారు. అనంతరం దుడ్డు కర్రతో కొడుతూ మార్కెట్లో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో విషయం వెలుగు చూసింది.

అంతేకాకుండా అదేరోజు రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి, నేరపూరిత బెదిరింపు చర్యకు పాల్పడినందుకు, ఉద్ధేశ్యపూర్వకంగా అవమానించినందుకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అయిన లోన్‌ ఏజెంట్‌ సుందర్‌ సింగ్‌తోపాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.