Viral News: చనిపోయాడని వ్యక్తిని పోస్ట్‌మార్టంకు తరలించారు.. అంతలోనే ఊహకందని సీన్
పంజాబ్ రాష్ట్రంలో లుథియానాకు చెందిన మన్‌ప్రీత్ అనే పోలీస్ అధికారికి సెప్టెంబర్ 15వ తేదీన ఓ విష పురుగు కుట్టింది. దీంతో వెంటనే లుథియానాలో ఉన్న బస్సీ అనే ఆసుపత్రిలో చేర్పించారు. పురుగు కుట్టి చాలా సేపు గడడంతో విషయం ఒళ్లంతా పాకింది. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకడంతో మన్‌ప్రీత్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే వైద్యులు మన్‌ప్రీత్‌ను వెంటిలేటర్‌పై...

చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు.. ఇలాంటి వార్తలు మనం చాలాసార్లు చూశే ఉంటాం. అంతిమ యాత్ర జరుగుతున్న సమయంలో శరీరంలో కదలికలు గుర్తించారు, దీంతో చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు ఇలాంటి వార్తలు నిత్యం ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇలాంటి సంఘటనల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. చనిపోయాడనుకున్న ఓ పోలీస్ ఆఫీసర్‌ను ఏకంగా పోస్ట్‌మార్టంకు తరలిస్తుండగా మళ్లీ బతికాడు. ఈ ఊహకందని సంఘటనకు సంంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పంజాబ్ రాష్ట్రంలో లుథియానాకు చెందిన మన్‌ప్రీత్ అనే పోలీస్ అధికారికి సెప్టెంబర్ 15వ తేదీన ఓ విష పురుగు కుట్టింది. దీంతో వెంటనే లుథియానాలో ఉన్న బస్సీ అనే ఆసుపత్రిలో చేర్పించారు. పురుగు కుట్టి చాలా సేపు గడడంతో విషయం ఒళ్లంతా పాకింది. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకడంతో మన్‌ప్రీత్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో వెంటనే వైద్యులు మన్‌ప్రీత్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స ప్రారంభించారు. అయితే వైద్యుల కృషి ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా సెప్టెంబర్ 18వ తేదీ అర్థరాత్రి మన్‌ప్రీత్ సింగ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం కుటుంబ సభ్యలకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక మరుసటి రోజు ఉదయం మన్‌ప్రీత్ సింగ్‌ను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఇదే సమయంలో డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారి మన్‌ప్రీత్ సింగ్ శరీరంలో కదలికలను గమనించాడు. వెంటనే ఆ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో మన్‌ప్రీత్ సింగ్‌ను స్థానికంగా ఉన్న మరో ఆసుపత్రికి తరలించగా, వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, చికిత్స కొనసాగిస్తున్న ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. అయితే మన్‌ప్రీత్ సింగ్ చనిపోయాడని తాము ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదంటూ బస్సీ ఆసుపత్రి వైద్యులు తెలపడం ఇక్కడ కొస మెరుపు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..