Cheetah Cubs: చిరుతలకు భయంకర వైరస్‌.. 15 రోజుల వ్యవధిలోనే 7 చిరుత కూనలు మృతి.

Cheetah Cubs: చిరుతలకు భయంకర వైరస్‌.. 15 రోజుల వ్యవధిలోనే 7 చిరుత కూనలు మృతి.

Anil kumar poka

|

Updated on: Sep 21, 2023 | 9:00 AM

బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ చిరుత పిల్లల మరణాలు కలకలం రేపాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌ ఫీలైన్‌ పాన్‌ల్యూకోపెనియా బారిన పడి చిరుత కూనలు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గతంలోనే వాటికి టీకాలు వేయించినప్పటికీ.. వైరస్‌ సోకిందని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్కు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్‌ చిరుత పిల్లల మరణాలు కలకలం రేపాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌ ఫీలైన్‌ పాన్‌ల్యూకోపెనియా బారిన పడి చిరుత కూనలు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. గతంలోనే వాటికి టీకాలు వేయించినప్పటికీ.. వైరస్‌ సోకిందని, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పార్కు అధికారులు తెలిపారు. తొమ్మిది చిరుతపులి పిల్లలను సఫారీ ప్రాంతంలోకి విడుదల చేశామని, వాటిలో నాలుగు.. వైరస్‌ బారినపడి చనిపోగా.. రెస్క్యూ సెంటర్‌లోని మరో మూడు కూనలకూ వైరస్‌ సోకిందని అధికారులు తెలిపారు. సరైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. చనిపోయిన కూనల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉంటుందన్నారు. ఆగస్టు 22న మొదటిసారి వైరస్‌ వ్యాప్తిని గుర్తించామని పార్కు ఈడీ చెప్పారు. అయితే, ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో ఉందన్నారు. వైరస్‌ కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సీనియర్ పశువైద్యులతో చర్చలు జరిపామని, మొత్తం జంతుప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని తెలిపారు. రెస్క్యూ సెంటర్‌ను పూర్తిగా శానిటైజ్ చేశాం చేయించామన్నారు . ఫీలైన్‌ పాన్‌ల్యూకోపెనియా అనే వైరల్‌ అంటువ్యాధి పార్వోవైరస్ వల్ల కలుగుతుందని అధికారులు తెలిపారు. పిల్లి జాతులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దీని బారిన పడితే జీర్ణ వ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని, తీవ్రమైన విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్‌తో చివరికి మరణానికి దారితీస్తాయని తెలిపారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని, సరైన చికిత్స అందకపోతే ఈ వైరస్‌ సోకిన జంతువు నాలుగైదు రోజుల్లో చనిపోతుందని వెల్లడించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..