Viral Video: ట్రైన్‌ సీటు కోసం మహిళల రన్నింగ్‌ రేసులు..! ఆ.. అనిపిస్తున్న వీడియో..

Viral Video: ట్రైన్‌ సీటు కోసం మహిళల రన్నింగ్‌ రేసులు..! ఆ.. అనిపిస్తున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Sep 21, 2023 | 9:08 AM

బస్సులు, రైళ్లలో ప్రయాణించాలంటే.. అదో పెద్ద సాహసం వంటిదే.. ఏదో విధంగా సీటు సంపాదించడమే లక్ష్యం పరిగెట్టాల్సిందే! దాని కోసం చాలా మంది తోటి ప్రయాణికులతో కుస్తీలు పట్టాల్సి వస్తుంది. సీట్ల కోసం సిగపట్లే పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి మహిళలు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా జరిగింది. రద్దీగా ఉన్న లోకల్ రైలులో ఎంతలా అంటే మరో వ్యక్తి ఎక్కితే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు.

బస్సులు, రైళ్లలో ప్రయాణించాలంటే.. అదో పెద్ద సాహసం వంటిదే.. ఏదో విధంగా సీటు సంపాదించడమే లక్ష్యం పరిగెట్టాల్సిందే! దాని కోసం చాలా మంది తోటి ప్రయాణికులతో కుస్తీలు పట్టాల్సి వస్తుంది. సీట్ల కోసం సిగపట్లే పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి మహిళలు లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా జరిగింది. రద్దీగా ఉన్న లోకల్ రైలులో ఎంతలా అంటే మరో వ్యక్తి ఎక్కితే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముంబైలో ఓ లోకల్ రైలు ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చి రాగానే.. ప్రయాణికులంతా ఎగబడ్డారు. ఖాళీగా ఉన్న ట్రైన్‌లోకి వేగంగా దూసుకెళ్లారు. ట్రైన్ ఎక్కే క్రమంలో పక్కవాళ్లు కిందపడిపోయినా సరే.. తమకు మాత్రం ట్రైన్‌లో సీటు దొరకాలనే లక్ష్యంతోనే పరుగులు పెట్టారు. అలా కిందపడుతూ, లేస్తూ.. తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ట్రైన్‌ ఎక్కుతున్న దృశ్యం వారి బిజీ బిజీ లైఫ్‌‌కు అద్దం పడుతోంది. సీటు కోసం ఏకంగా యుద్దమే చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది .

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..