Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఆ విద్యార్థినులు నుదుట బొట్టు పెట్టుకుని, తలలో పూలు తురుముకుని రావడమే పెద్ద నేరమైంది. వారిని చూసిన స్కూలు నిర్వాహకులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూలుకు బొట్టు పెట్టుకుని వస్తారా? అంటూ బెత్తంతో చావబాదారు. అంతేకాదు స్కూలులోకి రావద్దంటూ బయటే నిలబెట్టారు. ఏపీలోని కడప జిల్లాలో జరిగిందీ ఘటన. పాఠశాల యాజమాన్యం తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఆ విద్యార్థినులు నుదుట బొట్టు పెట్టుకుని, తలలో పూలు తురుముకుని రావడమే పెద్ద నేరమైంది. వారిని చూసిన స్కూలు నిర్వాహకులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూలుకు బొట్టు పెట్టుకుని వస్తారా? అంటూ బెత్తంతో చావబాదారు. అంతేకాదు స్కూలులోకి రావద్దంటూ బయటే నిలబెట్టారు. ఏపీలోని కడప జిల్లాలో జరిగిందీ ఘటన. పాఠశాల యాజమాన్యం తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బొట్టు పూలు పెట్టుకొచ్చిన వారిని క్లాసులోకి అనుమతించొద్దని దువ్వూరు మండలం బుక్కాయిపల్లె ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిల్ కుమారి హుకుం జారీ చేసింది. బొట్టు పూలు పెట్టుకుని వచ్చిన విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టడంతో విద్యార్థులు నరకం అనుభవించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో ప్రధానోపాద్యాయురాలిని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అన్యమతస్తురాలు కావడంతోనే ఇలా చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు దేవుని మార్గంలో నడిస్తే ఉత్తీర్ణులవుతారని, లేకుంటే ఫెయిల్ అవుతారని తెలిపినట్టు విద్యార్థులు చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మండల విద్యాశాఖ అధికారి కూడా ఉపాధ్యాయురాలిని వెనకేసుకు వస్తున్నారని తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

