Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

|

Updated on: Jun 25, 2023 | 9:32 AM

పోలీసులను రక్షక భటులు అంటారు. తన, పర, పేద, ధనిక భేదం లేకుండా సమాజంలోని పౌరుల సమస్యలపట్ల స్పందించి, వారికి రక్షణ కల్పిచండం వీరి బాధ్యత. ఇంతంటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి కొందరు భక్షక భటుల్లా తయారవుతున్నారు. తమ అధికారంతో సామాన్యులను దోచుకుంటున్నారు.

పోలీసులను రక్షక భటులు అంటారు. తన, పర, పేద, ధనిక భేదం లేకుండా సమాజంలోని పౌరుల సమస్యలపట్ల స్పందించి, వారికి రక్షణ కల్పిచండం వీరి బాధ్యత. ఇంతంటి బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి కొందరు భక్షక భటుల్లా తయారవుతున్నారు. తమ అధికారంతో సామాన్యులను దోచుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్సై ఓ స్వీటు షాపు యజమానిని బెదిరిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లోని కల్యాణ్ పూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్‌.ఐ. సర్వేంద్ర కుమార్ ఓ స్వీట్ షాపు యజమానితో గొడవపడ్డాడు. బిల్లు కట్టమని అడిగినందుకు పెద్ద రచ్చచేసి.. అతన్ని బెదిరించాడు. ఆ స్వీటు షాపులో ఎస్సై 110 రూపాయల విలువగల స్వీట్స్ కొనుగోలుచేశాడు. అందుకు షాపు యజమాని డబ్బులు చెల్లించమని అడిగాడు. అంతే, కోపంతో ఊగిపోయిన పోలీస్.. యజమానితో గొడవకు దిగాడు. అతడిని దుర్భాషలాడుతూ ‘నన్నే డబ్బులు అడుగుతావా. రేపటి నుంచి నువ్వు షాప్ ఎలా నడుపుతావో చూస్తా. నేనేంటో చూపిస్తానంటూ’ వార్నింగ్ ఇచ్చాడు. అదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేసి.. పోలీస్ అధికారులను ట్యాగ్ చేశాడు. అంతే.. ఎస్సై చేసిన నిర్వాకం అంతా బయపడింది. సర్వేంద్ర కుమార్ ను సస్పెండ్ చేసి.. కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని కోరారు పోలీస్ అధికారులు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఎస్సై సర్వేంద్ర కుమార్ పై మండి పడుతున్నారు. అధికారం ఉందని, సామాన్య ప్రజలపై జలుం చూపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Follow us
పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత
పెళ్లికూతుర్ని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత
ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయా? 'మెటా ఏఐ' చెప్పిన సమాధానం ఏంటంటే..
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
త్రివిక్రమ్ ను పవన్ కళ్యాణ్ కరుణిస్తారా.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ప్రమాదంలో టీమిండియా ప్లేయర్ టెస్ట్ కెరీర్..
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
ఒకే జట్టులో కోహ్లీ, బాబర్.. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో ఆసియా కప్?
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
హంతకుడిని పట్టించిన ఈగలు.. ఈ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్..
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
ఈ ట్రైన్‌లో ప్రయాణించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. టికెట్ ఎంతో
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
టాలీవుడ్ పై కన్నేసిన కన్నడ బ్యూటీ.. ఎన్టీఆర్ జోడిగా ఛాన్స్.. !
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ పులగం.. ఇలా చేశారంటే సూపర్..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..
ఓర్నాయనో.. మందు తాగే అలవాటుందా..? మీ కిడ్నీలు గుల్లయినట్లే..