Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
పెళ్లంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. తమ జీవితం మధురస్వప్పంగా మిగిలిపోవాలని కలలు గంటారు. పెళ్లయి మొదటి రాత్రితో తమ దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. ఎంతో సంతోషంగా జరగాల్సిన మొదటిరాత్రి ఓ జంటకు చివరి రాత్రిగా మిగిలింది.
పెళ్లంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. తమ జీవితం మధురస్వప్పంగా మిగిలిపోవాలని కలలు గంటారు. పెళ్లయి మొదటి రాత్రితో తమ దాంపత్య జీవితం ప్రారంభమవుతుంది. ఎంతో సంతోషంగా జరగాల్సిన మొదటిరాత్రి ఓ జంటకు చివరి రాత్రిగా మిగిలింది. కొత్తగా పెళ్లైన వధూవరులు.. ఫస్ట్ నైట్ రోజున అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని గోధియా గ్రామానికి చెందిన ప్రతాప్ యాదవ్‌కు, పుష్పయాదవ్ అనే యువతితో మే 30 తేదీన వివాహం జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగవైభవంగా పెళ్లివేడుక జరిగింది. రెండు రోజుల తర్వాత వధూవరులకు మొదటిరాత్రికి ఏర్పాట్లు చేశారు. సంప్రదాయబద్ధంగా వధూవరులను గదిలోకి పంపారు. వధూవరులిద్దరూ గదిలోకి వెళ్లారు. తెల్లారి నవ దంపతులు ఎంతకీ తలుపు తెరవక పోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. తలుపు తియ్యకపోగా, కనీసం ఎలాంటి మాటలూ ఆ గదినుంచి వినిపించలేదు. దాంతో బలవంతంగా తలుపులు తెరిచిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. వధూవరులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. దాంతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. నవ దంపతుల మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. వారిద్దరూ గుండెపోటుతో చనిపోయారని తేల్చారు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం జరిపించారు. ఆ రిపోర్టులో వారిద్దరూ గదిలో గాలి సరిగా ఆడకపోవడంతో ఊపిరి అందక గుండెపోటుతో మరణించారని తేలింది. దాంతో ఈ కేసులో అనుమానించాల్సిందేమీ లేదని పోలీసులు తేల్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

