Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందో తెలుసా..?

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు పెరుగుతూ వస్తే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.

Gold Price Today: పరుగులు పెడుతున్న పసిడి ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందో తెలుసా..?
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2023 | 6:30 AM

Gold and Silver Latest Prices: పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు పెరుగుతూ వస్తే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, గత కొంతకాలం నుంచి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగులు పెడుతున్న విషయం తెలిసిందే.. గత నాలుగు రోజుల నుంచి బంగారం, వెండి ధర పెరుగుతూనే ఉంది. తాజాగా, బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.10 మేర పెరిగి రూ.60,230 కి చేరింది. వెండి కిలో ధర రూ.300 మేర తగ్గి రూ.74,500 లుగా కొనసాగుతోంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,370 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,230 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.55,500, 24 క్యారెట్ల ధర రూ.60,550, బెంగళూరులో 22 క్యారెట్లు రూ.55,200, 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,220 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,230, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,230కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,200 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,230 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.55,200, 24 క్యారెట్ల ధర రూ.60,230 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,500 ఉంటే.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,500లుగా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000, బెంగళూరులో రూ.74,250, కేరళలో రూ.78,000, కోల్‌కతాలో రూ.74,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.78,000, విజయవాడలో రూ.78,800, విశాఖపట్నంలో రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్