Madhapur Drugs Case: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్.. నిందితుల సెల్‌ఫోన్లలో సినీ ప్రముఖుల పేర్లు

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల సెల్‌ ఫోన్లలో సినీ ప్రముఖుల నంబర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరి కార్యకలాపాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తొలుత నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి రేవ్‌ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను పెంచుకోవడం వీరి దందాలో అసలు ఎత్తు. అనంతరం వీరిని అడ్డుపెట్టుకొని..

Madhapur Drugs Case: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ట్విస్ట్.. నిందితుల సెల్‌ఫోన్లలో సినీ ప్రముఖుల పేర్లు
Madhapur Drugs Case
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2023 | 8:11 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్ 20: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల సెల్‌ ఫోన్లలో సినీ ప్రముఖుల నంబర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరి కార్యకలాపాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. తొలుత నైజీరియన్ల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి రేవ్‌ పార్టీలకు సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మత్తుపదార్థాలు ఎరవేసి అమ్మాయిలను రప్పించడం, ప్రముఖుల పరిచయాలను పెంచుకోవడం వీరి దందాలో అసలు ఎత్తు. అనంతరం వీరిని అడ్డుపెట్టుకొని సినీ నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఇటీవల అరెస్టయిన ఎనిమిది మంది నిందితుల అసలు రూపాలు ఇవే. రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో పోలీసులు నిందితుల కాల్‌ డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్‌ నంబర్లను గుర్తించారు. నిందితులు బాలాజీ, రాంకిశోర్‌, కల్హర్‌రెడ్డి సెల్‌ఫోన్ల డేటాలో ఈ వివరాలు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో దర్యాప్తును ముమ్మరం చేసింది.

సినీ నిర్మాతలు రవి ఉప్పలపాటి, వెంకట రత్నారెడ్డిలకు డ్రగ్స్‌ సప్లయ్‌ చేసే వారి వివరాలు కూడా బయటికి వచ్చాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ, విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్‌ ద్వారా వీరికి డ్రగ్స్‌ చేరేవని విశ్వసనీయ సమాచారం. బెంగళూరులోని నైజీరియన్ల నుంచి బాలాజీ కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు తీసుకొచ్చేవాడు. ఈ విషయంలో బాలాజీకి రాంకిశోర్‌ సహకరించేవాడు. బెంగళూరులోని నైజీరియన్ల నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు భారీ మొత్తంలో విక్రయించేవారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలోని రెంటల్‌ అపార్టుమెంట్లలో రేవ్‌ పార్టీలు నిర్వహించేవారు. ఈ పార్టీలకు మోడళ్లు, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే యువతులకు డ్రగ్స్‌ ఎరవేసి రప్పించేవారు. ఇలా వీరు దాదాపు18 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఇప్పటికే విచారణలో వెంకట్‌ అంగీకరించాడు. సుశాంత్‌ రెడ్డి, ఇంద్రతేజ, కలహర్‌ రెడ్డి, రాంచంద్‌, అర్జున్‌, ఉప్పలపాటి రవి, సురేష్, సూర్య, శ్వేత, కార్తిక్‌, నర్సింగ్, రాంకుమార్, ప్రణీత్, సందీప్‌, హిటాచీ, అజీమ్, అంజద్‌కు అమ్మినట్టు వెంకట్‌ పోలీసులకు తెలిపాడు.

డ్రగ్స్‌ నిందితుల కస్టడీకి కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ డ్రగ్స్‌ ముఠా లింకులను ఛేదించేందుకు టీఎస్‌న్యాబ్‌ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్టయిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిని విచారించేందుకు పోలీసు కస్టడీ కోరుతూ మంగళవారం (సెప్టెంబర్ 19) కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. భాస్కర్‌, మురళీ వెంకట రత్నారెడ్డిలను అరెస్ట్‌ చేసిన తర్వాత సేకరించిన కీలక సమాచారంతో సెప్టెంబర్‌ 14వ తేదీన ముగ్గురు నైజీరియన్లు, మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావు, రాంచంద్‌, కె సందీప్‌, సుశాంత్‌రెడ్డి, శ్రీకర్‌ కృష్ణప్రసాద్‌లను అరెస్ట్‌ చేశారు. వీరంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మరో ఏడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు తాజాగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ