Funny Video: ‘నా భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు.. కనిపించడం లేదు’ ఈ గడుగ్గాయి అల్లరి చూస్తే నవ్వాగదు
ఒక్కోసారి పిల్లలు చేసే చిలిపి పనులు పొట్టచక్కలయ్యేలా నవ్విస్తాయి. అమాయకత్వం, తెలియని తనం పిల్లలు చేసే అల్లరికి ప్రతిబింబాలు. వచ్చీరాని చిట్టిపొట్టి మాటలు మాట్లాడుతూ ఇల్లంతా కలియ తిరుగుతూ సందడి చేస్తుంటారు. అందుకే వీళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ గడుగ్గాయికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన భర్త కనిపించడం..
పంజాబ్, సెప్టెంబర్ 19: ఒక్కోసారి పిల్లలు చేసే చిలిపి పనులు పొట్టచక్కలయ్యేలా నవ్విస్తాయి. అమాయకత్వం, తెలియని తనం పిల్లలు చేసే అల్లరికి ప్రతిబింబాలు. వచ్చీరాని చిట్టిపొట్టి మాటలు మాట్లాడుతూ ఇల్లంతా కలియ తిరుగుతూ సందడి చేస్తుంటారు. అందుకే వీళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ గడుగ్గాయికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన భర్త కనిపించడం లేదంటూ..? పాపం ఓ క్యూట్ పాప గుక్కపట్టి ఏడుపు లంకించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు చూసేయండి..
ఈ ఫొటోలో ఓ రెండు జళ్ల పాప నేలపై కూర్చొని ఏడవడం కనిపిస్తుంది. చిన్నారి తల్లి పాప వద్దకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావంటూ ప్రశ్నించడం వీడియోలో కనిపిస్తుంది. నా భర్త కనిపించడం లేదంటూ ఏడుస్తూనే చెబుతుంది. అర్థం చేసుకోరా.. అత్తామాలు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు నాకు దిక్కు ఎవరు? అని ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది. చిన్నారి తల్లి ఓదార్చడానికి ప్రయత్నిస్తూ.. బేటా నీకు ఇంకా భర్త రాలేదు. పెద్దయ్యాక వస్తాడు అంటూ ఓదార్చుతుంది. అయితే నా భర్త ఎక్కడికి వెళ్లాడంటూ మళ్లీ పెద్దగా ఏడుస్తుంది. కాసేపు తర్వాత ‘నా పిల్లలు..’ అంటూ అడుగుతుంది. చిన్న పిల్లలకు చెల్లెల్లు, తమ్ముళ్లు, అన్నలు, అక్కలు ఉంటారు. వాళ్లకు పిల్లలు ఉండరు అని తల్లి సర్దిచెప్పడం వీడియోలో కనిపిస్తుంది.
View this post on Instagram
ఇక చుట్టూ ఉన్న బంధువులు చిన్నారి మాటలకు పగలబడి నవ్వుతుంటారు. ఈ విచిత్ర సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ భర్త కనిపించడం లేదంటూ ఏడుస్తున్న ఈ పాప వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. లక్షల్లో వీక్షణలు, లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి. నెటిజన్లు తమ పిల్లలు కూడా మ్యారెజ్ ఫంక్షన్‌కు వెళ్తే నాకూ పెళ్లి చేయాలని మారం చేస్తుంటారని తమ అనుభవాలను కామెంట్ సెక్షన్‌లో పంచుకున్నారు. అనుకుంటాం గానీ అల్లరి గడుగ్గాయిలను అదుపు చెయ్యడం అంత సులువుకాదు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.