కిడ్నీ సమస్యలు గతంలో కంటే నేటి కాలంలో ఎక్కువయ్యాయి. గాడి తప్పిన ఆహార అలవాట్లు, ధూమపానం, తక్కువగా నీళ్లు తాగడం, బయటి ఆహారం ఎక్కువగా తినడం, ఊబకాయం వంటి వాళ్ల మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్నిసందర్భాల్లో మందుల వళ్ల కూడా కరిగిపోతాయి.