Beautiful Villages: దేశంలోనే ఇవి అందమైన గ్రామాలు.. ఓ లుక్కేయండి
దేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే అందమైన గ్రామాలుగా పేరుపొందాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్‌లోని కల్ప అనేది ఓ రహస్య గ్రామం. ఇది హైవే నుంచి చూస్తే కనిపించదు. అయితే ఈ గ్రామం అందరిని ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ చూస్తే యాపిల్ తోటలే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఏకంగా కైలాస పర్వత మంచు శిఖరాలను సైతం చూడొచ్చు. ఇక్కడ కనిపించినట్లుగా ఆ శిఖరాలు మరోచోటు కనిపించవు. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న మావ్లిన్నోంగ్ అనే గ్రామం అసలు ఆసియాలోనే పరిశుభ్రమైదిగా నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
