Aravind B

Aravind B

Sub-Editor - TV9 Telugu

aravind.baiyya@tv9.com

తెలుగు మీడియా రంగంలో రెండేళ్ల అనుభవం ఉంది. 2021లో ఈటీవీతో తెలుగు మీడియా రంగంలోకి వచ్చాను. 2023 నుంచి ఇప్పటివరకు టీవీ9 తెలుగు (డిజిటల్)లో కొనసాగుతున్నాను.

Israel-Hamas: ఇజ్రాయెల్‌లోని భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి మీనాక్షి లేఖి

Israel-Hamas: ఇజ్రాయెల్‌లోని భారతీయ విద్యార్థులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి మీనాక్షి లేఖి

ఇజ్రాయెల్‌ పాలస్తీనాల మధ్య భీకర పోరు జరుగుతోంది. అయితే ఈ యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి పేర్కొన్నారు. అయితే ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ISRO: ఆదిత్య ఎల్1 మార్గాన్ని సరిదిద్దాం.. ఇస్రో కీలక ప్రకటన

ISRO: ఆదిత్య ఎల్1 మార్గాన్ని సరిదిద్దాం.. ఇస్రో కీలక ప్రకటన

సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య- ఎల్‌1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తోంది. అయితే ఇప్పటికే ఆదిత్య ఎల్1 ఉపగ్రహం భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. ఈ క్రమంలోనే వ్యౌమనౌక మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది. లగ్రాంజ్‌ పాయింట్‌-1 (L1) దిశగా దూసుకెళ్తున్నటువంటి వ్యౌమనౌకను దాని నిర్దేశిత మార్గంలో ఉంచేందుకు టీసీఎం ఎంతగానో దోహదపడుతుంది.

Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు

Telangana: ఓట్లు మావే.. సీట్లు మావే.. ముదిరాజు ఆత్మగౌరవ సభలో ఈటల కీలక వ్యాఖ్యలు

సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ముదిరాజ్ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలివచ్చారు.ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా కులానికి సంబంధించిన ముఖ్యనాయకులందరూ మీటింగ్‌కి హాజరయ్యారు. ఈ నేపథ్యలో ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలకు చేశారు. జనాభా ప్రకారం ముదిరాజులకు 11 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అన్నారు.

అమ్మో.. యువకుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.753 కోట్లు.. కానీ

అమ్మో.. యువకుడి బ్యాంక్‌ ఖాతాలో రూ.753 కోట్లు.. కానీ

ఈ మధ్యకాలంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది చేస్తున్నటువంటి పొరబాట్లు, నిర్లక్ష్యాల వల్ల ఒకరికి బదులుగా మరొకరి ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ కావడం.. ఆ తర్వాత అవి మళ్లీ వెనక్కి వెళ్లడం తమిళనాడులో పరిపాటిగా మారిపోయింది. గత నెల రాజ్‌కుమార్‌ అనే ఫార్మసీ వర్కర్ ఖాతాలో ఏకంగా 9 వేల కోట్ల రూపాయలు తమిళనాడు మార్కంటైల్‌ బ్యాంక్‌ నుంచి జమ అయ్యింది.

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌లో ఏకమవుతున్న అధికార, విపక్ష పార్టీలు..

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌లో ఏకమవుతున్న అధికార, విపక్ష పార్టీలు..

ఇజ్రాయెల్‌పై అతిపెద్ద మిలిటెంట్‌ దాడి జరగడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ దేశంలోని ప్రభుత్వ ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసర జాతీయ సమైక్యతా ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చలు చేయడం ప్రారంభించాయి. అయితే తాజాగా హమాస్‌ దాడిలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Israel-Palestine conflict: పదేళ్ల క్రితమే దాడులు చేసేందుకు ప్రణాళికలు.. చివరికి

Israel-Palestine conflict: పదేళ్ల క్రితమే దాడులు చేసేందుకు ప్రణాళికలు.. చివరికి

ఆపరేషన్‌ ఆల్‌-అఖ్సా స్టార్మ్‌’ పేరుమీద ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపు దాడి చేయడంతో ఇజ్రాయెల్-పాలస్తీన్‌ల మధ్య భీకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ దాడి చేసేందుకు దాదాపు పదేళ్లకు ముందు నుంచే నిశ్శబ్దంగా ఏర్పాట్లు జరిగిపోయినట్లు తెలుస్తోంది 2014లో దీనిపై హెచ్చరికలు వచ్చినా కూడా ఇజ్రాయెల్‌ దీనిపై పెడచెవిన పెట్టిన ఫలితాన్ని తాజాగా చూస్తోంది.

Israel-Palestine conflict: హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా లండన్‌లో సంబరాలు.. స్పందించిన పోలీసులు

Israel-Palestine conflict: హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా లండన్‌లో సంబరాలు.. స్పందించిన పోలీసులు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను ప్రపంచదేశాలు ఖండిస్తున్నాయి. భారత్‌తో పాటుగా బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు తమ మద్దతును ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అలాగే హమాస్‌ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో పాటు లండన్‌ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

బిహార్ అయిపోయింది.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కుల గణన సర్వే

బిహార్ అయిపోయింది.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కుల గణన సర్వే

రాజస్థాన్‌లోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కూడా కుల గణన సర్వే నిర్వహించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనికి మంత్రి మండలి ఆమోదం కూడా లభించిన అనంతరం ఇందుకు సంబంధించిన ఆదేశాలను సామాజిక న్యాయం, సాధికారక శాఖ విడుదల చేసింది. ఇప్పటికే బిహార్ కుల గణన చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బిహార్ తర్వాత కుల గణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుంది.

Telangana: టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా ?

Telangana: టికెట్లపై ఆ సామాజిక వర్గం ఆందోళన.. పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయా ?

కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఏదో రాజకీయంగా తాత్కాలికంగా రేగిన చిచ్చు కాదు. దశాబ్దాల పాటు తమకేంటి..అన్న ప్రశ్న నుంచి ఉదయించిన ఉద్యమం. అక్కడ రేణుక చౌదరి కాంగ్రెస్ నేతగా కనిపిస్తున్నా...కాంగ్రెస్సే కావాలని కమ్మవర్గాల్లో చిచ్చుపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నా.. బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతోనే కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారన్న వెర్షన్ గట్టిగా ప్రచారంలోకివచ్చినా...ఇది కచ్చితంగా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే సీరియస్ అంశంగానే చూడాలన్నది విశ్లేషకుల నుంచి వస్తున్నమాట.

Israel-Palestine Conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే ?

Israel-Palestine Conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు.. స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే ?

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మెరుపు దాడితో ఇజ్రాయెల్‌లో ప్రస్తతం యుద్ధ పరిస్థితులు కొనసాగడం కలకలం రేపుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు జరిపిన దాడులతో 50 మంది ఇజ్రాయెల్‌ పౌరుల మృతిచెందగా..100 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేకాదు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. అలాగే ఇజ్రాయెల్‌ సైనికులను బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌‌పై హమాస్ మిలిటెంట్ల దాడులు.. వీధుల్లో పౌరులపై కాల్పులు

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌‌పై హమాస్ మిలిటెంట్ల దాడులు.. వీధుల్లో పౌరులపై కాల్పులు

పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్ గ్రూప్‌ మెరుపు దాడుల వల్ల ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ అక్కడ యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగినటువంటి హమాస్‌ మిలిటెంట్లు.. సరిహద్దును దాటి దేశంలోకి చొరబడ్డారు. అంతేకాదు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని సెరాట్‌ ప్రాంతంలో కొందరు హమాస్‌ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ రోడ్డుపై వెళ్తున్న ఓ ఎస్‌యూవీ వాహనంపై కాల్పులు జరిపారు.

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి.. భారత పౌరులకు హెచ్చరికలు చేసిన ఎంబసీ

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి.. భారత పౌరులకు హెచ్చరికలు చేసిన ఎంబసీ

తమ దేశంపై దాడికి దిగినటువంటి హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ దీటుగా ఎదుర్కొంటోంది. దీనివల్ల ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉంటున్నటువంటి భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ పలు సూచనలు జారీ చేసింది. ఎవరూ కూడా అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అలాగే స్థానిక అధికారులు సూచించే భద్రతా ప్రొటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని పేర్కొంది.

చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!