AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ను ప్రశంసించిన నటుడు.. ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే

నటుడు మాధవన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాధవన్‌ నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ వంటి పలుభాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. కాగా మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లాడు. అక్కడ కొత్తగా తెరిచిన టెర్మినల్‌లో మౌలిక..

Watch Video: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ను ప్రశంసించిన నటుడు.. ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే
Actor Madhavan
Srilakshmi C
|

Updated on: Sep 17, 2023 | 12:02 PM

Share

నటుడు మాధవన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మాధవన్‌ నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ వంటి పలుభాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. కాగా మాధవన్ ఇటీవల బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు వెళ్లాడు. అక్కడ కొత్తగా తెరిచిన టెర్మినల్‌లో మౌలిక సదుపాయాలను చూసి తెగ సంభరపడిపోయాడు. అక్కడి విలాసవంతమైన గార్డెన్‌లో అంతర్జాతీయ టెర్మినల్ గురించి ప్రశంసిస్తూ ఈ వీడియో తీశాడు. దేశంలోనే బెస్ట్ ఇన్‌ఫ్రాస్రక్చర్‌ అని తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

‘మన దేశంలో మౌలిక సదుపాయాలు ఎలా మారుతున్నాయనేది నమ్మశక్యం కావట్లేదు! నేను కెంపెగౌడ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను. ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గురించి మీకు చెప్తున్నాను. ఇది విదేశీ ఎర్‌పోర్ట్‌లా కనిపిస్తుంది. ఇది ఇండియన్‌ ఎయిర్‌ పోర్టని ఎవరూ నమ్మలేరు. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ విమానాశ్రయంలో కప్పుపై భాగాల నుంచి కిందికి వేలాడుతున్నాయి. ఇవి నిజమైన మొక్కలు. సీలింగ్‌ నుంచి ప్రతిరోజు ఈ మొక్కలకు నీళ్లు అందుతాయి. మీరు చూస్తున్న అన్ని నిర్మాణాలు వెదురుతో తయారు చేశారు. పైకప్పును చూడండి. ఇది భారత్‌లో స్థిరత్వం చుట్టూ ఉన్న నేపథ్యం. చాలా గర్వంగా ఉంది! వెరీ వెల్‌డన్‌ మ్యాన్‌’ అంటూ ప్రధాని మోదీని వీడియోలో ప్రసంశించాడు. అంతేకాకుండా అక్కడి మౌలిక సదుపాయాల గురించి వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by R. Madhavan (@actormaddy)

మాదవన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరొక వీడియోను కూడా పంచుకున్నాడు. బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, అందులోని మౌలిక సదుపాయాలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. సో ఫ్రౌడ్‌ అని ప్రశంశించాడు. ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దాదాపు 5 లక్షల లైకులు, మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చిపడ్డాయి. ఇక మాదవన్‌ వీడియోపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ అభివృద్ధికి నెక్ట్స్‌ జెనరేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ఇక బెంగుళూరు విమానాశ్రయాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. విదేశీ ఎయిర్‌ పోర్టుల కంటే ఇండియన్‌ విమానాశ్రయాలు చాలా మెరుగ్గా ఉన్నాయి’, ‘మీ ఉనికి ఈ స్థలాన్ని మరింత అందంగా మార్చింది’, ‘నిజమే. ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయం’ అంటూ కామెంట్లు పెట్టారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?