AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గ్రామాలను ముంచెత్తిన భాగమతి నది.. వరద వార్తలు చదువుతూ పుసుక్కున నవ్వేసిన యాంకరమ్మ! నెటిజన్స్‌ ఫైర్

బీహార్‌లోని బాగ్‌మతి నది భీభత్సం సృష్టిస్తోంది. వరద నీరు గ్రామాలపైకి దూసుకురావడంతో ఎందరో స్థానికులు నిరాశ్రయులయ్యారు. పంట పొలాలు ధ్వంసం అయ్యి, సర్వం పోగొట్టుకున్న స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ హృదయ విదారక వార్తలను చదువు తోన్న ఓ న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ఓ యాంకరమ్మ వార్తల మధ్యలో పుసుక్కున నవ్వేసింది. దీంతో అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. జనాలు ప్రాణాల కోసం అల్లాడిపోతుంటే నీకు అంత..

Watch Video: గ్రామాలను ముంచెత్తిన భాగమతి నది.. వరద వార్తలు చదువుతూ పుసుక్కున నవ్వేసిన యాంకరమ్మ! నెటిజన్స్‌ ఫైర్
News Anchor 'laughs' While Reporting News
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2023 | 9:46 AM

పట్నా, సెప్టెంబర్ 15: బీహార్‌లోని బాగ్‌మతి నది భీభత్సం సృష్టిస్తోంది. వరద నీరు గ్రామాలపైకి దూసుకురావడంతో ఎందరో స్థానికులు నిరాశ్రయులయ్యారు. పంట పొలాలు ధ్వంసం అయ్యి, సర్వం పోగొట్టుకున్న స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఈ హృదయ విదారక వార్తలను చదువు తోన్న ఓ న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ఓ యాంకరమ్మ వార్తల మధ్యలో పుసుక్కున నవ్వేసింది. దీంతో అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. జనాలు ప్రాణాల కోసం అల్లాడిపోతుంటే నీకు అంత వెటకారంగా ఉందా అంటూ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలింతకీ ఏం జరిగిందంటే..

బీహార్ & జార్ఖండ్‌కు చెందిన ఓ మీడియా సంస్థకు చెందిన న్యూస్ యాంకర్ సీరియస్‌గా బీహార్‌లోని పలు ప్రాంతాల్లో బాగ్మతి నది సృష్టించిన విధ్వంసాన్ని చదువుతోంది. లైవ్‌ టెలికాస్ట్‌ (ప్రత్యక్ష ప్రసారం) జరుగుతోంది. ఇంతలో ఓ పదాన్ని సరిగ్గా ఉచ్చరించడం రాక యాంకర్‌ తప్పుగా పలికింది. దీంతో ఒక్కసారిగా యాంకర్‌ నవ్వేసింది. ఇంతటి సీరియస్‌ వార్తలను లైవ్‌ టెలికాస్ట్‌ చెబుతూ నవ్వినందుకు పాపం.. యాంకర్‌ తీవ్రంగా విమర్శల పాలవుతోంది. బీహార్‌ రాష్ట్రంలోని తీవ్రమైన సమస్యకు సంబంధించిన వార్తల కవరేజీలో ఆమె హాస్యం వ్యక్తం చేసిందనేది చూసే జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో యాంకర్‌ ఉద్దేశ్యపూర్వకంగా నవ్వకపోయినప్పటికీ ఆన్‌ స్క్రీన్‌పై నవ్వడంతో ‘ఇందేందమ్మా మరీ అంత ఒళ్లుతెలియకుండా నవ్వుతున్నావ్‌..’ అంటూ విమర్శిస్తున్నారు. నిజానికి పదాన్ని తప్పుగా ఉచ్చరించడంతో యాంకర్‌ తనలో తాను నవ్వుకుంది.

ఇవి కూడా చదవండి

వరదల గురించిన వార్తలను చదువుతూ యాంకర్‌ నవ్విన అన్‌కట్, ఎడిట్ చేయని ఫుటేజ్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యాంకర్‌ చేసిన పనికి నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. ‘నేపాల్ సే చోడే గయే పానీ కే చల్తే దర్భంగా మే భాగమతి (నేపాల్ దర్భంగాలో ఉన్న బాగమతి నది వరద నీటి ధాటికి నవ్వులు, దగ్గులు కూడా వస్తున్నాయంటూ..)’ చురకలంటిస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో లేడీ యాంకర్‌ తెరపై ‘మాఫ్ కీజీయేగా’ అంటూ క్షమాపణలు చెప్పింది.

యాంకర్‌ క్షమాపణలు చెప్పిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సుమారు 30 మంది పిల్లలతో ఉన్న పడవ బోల్తా పడిన సంగతి తెలిసిందే. వారిలో 12 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.