Cooking Tips: మీ వంటల్లో రెస్టారెంట్‌ లాంటి గ్రేవీ కావాలంటే ఈ 5 టిప్స్‌ ఫాలో అవ్వండి.. లొట్టలేసుకుని తినేస్తారు!

ఇంట్లో వండే వంటకాల్లో ఒక్కోసారి అన్ని రకాల మసాలా దినుసులు వేసినా రుచి అబ్బదు. మీ వంటకు అదిరిపోయే రుచి రావాలంటే.. ముఖ్యంగా రెస్టారెంట్‌ వంటకాల రుచి రావాలంటే ఈ ఐదు రకాల పదార్ధాలను మీరు వండే కూరల్లో కలిపి చూడండి..రుచి అదిరిపోద్దంతే!..

Srilakshmi C

|

Updated on: Sep 14, 2023 | 6:29 PM

ఇంట్లో వండే వంటకాల్లో ఒక్కోసారి అన్ని రకాల మసాలా దినుసులు వేసినా రుచి అబ్బదు. మీ వంటకు అదిరిపోయే రుచి రావాలంటే.. ముఖ్యంగా రెస్టారెంట్‌ వంటకాల రుచి రావాలంటే ఈ ఐదు రకాల పదార్ధాలను మీరు వండే కూరల్లో కలిపి చూడండి..రుచి అదిరిపోద్దంతే!

1 / 5
కొన్నిసార్లు వంటల రుచిని మరింత పెంచడానికి అదనంగా కొన్ని రకాల పదార్థాలు అవసరమవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు తయారు చేసే కూరలు చిక్కగా రావాలంటే కొన్ని రకాల పిండిని కలపవచ్చు. అయితే పిండిని కలుపుతున్నప్పుడు ముద్దగా కాకుండా తొలుత పిండిని నీళ్లలో కరిగించి గ్రేవీలో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కూరలు రుచిగా ఉండటమే కాకుండా చిక్కగా కూడా ఉంటాయి.

2 / 5
మీ వంటలు కొత్త రుచిని సంతరించుకోవడానికి పుచ్చకాయ విత్తనాలను కలపవచ్చు. పుచ్చకాయ విత్తనాలు ఆహారంలో కలుపుకుంటే గ్రేవీ చిక్కగా మారుతుంది. ఇది ఆహారానికి ప్రత్యేక రుచిని కూడా జోడిస్తుంది. ముందుగా పుచ్చకాయ విత్తనాలను మెత్తగా గ్రైండ్ చేసి నీళ్లలో కలుపుకోవాలి. ఆ తర్వాత కూర పూర్తిగా ఉడికిన తర్వాత గరిటెతో కలుపుతూ గ్రేవీలో కలుపుకోవాలి.

3 / 5
చికెన్, చీజ్ వంటి వంటకాల తయారు చేసేటప్పుడు గ్రేవీకి జీడిపప్పు పిండిని కలిపితే కూరల రుచి అదిరిపోతుంది. ఇలా చేసిన గ్రేవీ రెస్టారెంట్ రుచిని పోలి ఉంటుంది. అలాగే కూరల్లో శనగ పిండిని కూడా కలపవచ్చు. ఇది కూడా నీళ్లలో కరిగించిన తర్వాతే గ్రేవీలో కలుపుకోవాలి.

4 / 5
పుల్లటి పెరుగు గ్రేవీకి మంచి రుచిని తీసుకువస్తుంది. దీనిని మసాలా దినుసులతోపాటు కూరలో కలుపుకోవాలి. ఇది వంటలకు మంచి రుచిని తీసుకొస్తుంది

5 / 5
Follow us