Watch Video: స్కూళ్లో టీచరమ్మ కుప్పిగంతులు.. వీడియో తీసిన విద్యార్ధులు! ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..

సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వడానికి, లైక్స్ కామెంట్ల కోసం ఈ మధ్యకాలంలో యువత పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి.. ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పాల్సిన స్కూల్ టీచర్లు కూడా ఇదే బాటలో ప్రయాణించడం విచారకరం. తాజాగా రీల్స్ మోజులో పడి ఓ స్కూల్‌ టీచర్‌ చేసిన పనిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రీల్స్ పిచ్చిలో తానొక టీచర్‌నన్న విషయమే మర్చిపోయింది. విద్యార్ధులకు పాఠాలు బోధించకుండా వారితో రీల్స్‌ షూట్‌ చేయించింది..

Watch Video: స్కూళ్లో టీచరమ్మ కుప్పిగంతులు.. వీడియో తీసిన విద్యార్ధులు! ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నెటిజన్లు..
UP School Teacher Controversial Dance
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2023 | 8:44 AM

బులంద్‌షహర్, సెప్టెంబర్ 15: సోషల్‌ మీడియాలో వైరల్ అవ్వడానికి, లైక్స్ కామెంట్ల కోసం ఈ మధ్యకాలంలో యువత పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి.. ఇది తప్పు.. ఇది ఒప్పు అని చెప్పాల్సిన స్కూల్ టీచర్లు కూడా ఇదే బాటలో ప్రయాణించడం విచారకరం. తాజాగా రీల్స్ మోజులో పడి ఓ స్కూల్‌ టీచర్‌ చేసిన పనిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. రీల్స్ పిచ్చిలో తానొక టీచర్‌నన్న విషయమే మర్చిపోయింది. విద్యార్ధులకు పాఠాలు బోధించకుండా వారితో రీల్స్‌ షూట్‌ చేయించింది ఈ టీచరమ్మ. విద్యార్ధుల ముందు కుప్పిగంతులు వేస్తూ హల్‌చల్ చేసింది. ఇదేంటని ప్రశ్నించిన వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఈ వ్యవహారం కాస్తా విద్యాశాఖ అధికారులకు చేరింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులన్‌షహర్ జిల్లాలో చోటుచేసుకుంది. టీచరమ్మ కుప్పిగంతులు వీడియో మీరూ చూడండి..

ఉత్తరప్రదేశ్‌లోని బులన్‌షహర్ జిల్లాకు చెందిన ఓ స్కూట్‌ టీచర్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయులకు వీడియో చేరడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. వెంటనే వారు ఆమెపై విద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోలో ఉన్న ఉపాధ్యాయురాలి పేరు ప్రభా నేగి. ఆమె యూపీలోని రివాడ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. 1990లో విడుదలైన ఆషికి చిత్రం మువీలో ‘ధీరే ధీరే సే మేరీ జిందగీ మే ఆనా’ అనే పాట రీమిక్స్ వెర్షన్‌కు డ్యాన్స్ చేయడం వీడియోలో కనిపిస్తుంది. పాఠశాల తరగతి గదిలోనే విద్యార్థులు తమ టీచర్ వీడియోను షూట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో టీచరమ్మ డ్యాన్స్ రీల్ గురించి వార్తలు వేగంగా వ్యాపించాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు టీచరమ్మకు గడ్డిపెడుతున్నారు. నువ్వు డ్యాన్స్‌ చేసిన రీల్‌ను స్టూడెంట్స్‌తో షూట్ చేయించి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ టీచర్‌ అయ్యుండి విద్యార్ధుల ముందు రీల్స్‌ చేయడానికి బుద్ధుందా? నీలాంటి వారివల్లే సొసైటీలో ఉపాధ్యాయ వృత్తికి కలంకం ఏర్పడుతోందని దుమ్ముత్తిపొస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు కొందరు ధైర్యంగా ముందుకు వచ్చి.. పాఠశాలలో కూడా తన వీడియోను చిత్రీకరించమని సదరు టీచరమ్మ పలు మార్లు కోరినట్లు తెలిపారు.

కాగా వీడియోలో ఉన్న టీచర్‌ ప్రభా నేగి తరచుగా తన వీడియోలను ఫేస్‌బుక్ లో పోస్ట్ చేస్తుంటుంది. వాటిల్లో అధిక వీడియోలు స్కూల్‌ విద్యార్ధులే చిత్రీకరించినట్లు సమాచారం. అదే పాఠశాలలోని తోటి ఉపాధ్యాయులు BSA (విద్యా అధికారి)కి ఫిర్యాదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.