Face Pigmentation: రాత్రి నిద్రపోయే ముందు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. బ్యూటీపార్లర్‌కి వెళ్లాల్సిన పనే ఉండదు
అందం సంరక్షణ కోసం ఆడవాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. రోజువారీ పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా చర్మ సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముఖ్యంపై నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎన్నో కాస్మటిక్స్ వినియోగించినా వాటిల్లోని రసాయనాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయే తప్ప ఫలితం ఉండదు. పార్లర్‌కు వెళ్లి ఫేషియల్, బ్లీచింగ్ చేయించినా దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు. ఇంట్లోనే సహజ..
Updated on: Sep 14, 2023 | 4:47 PM

అందం సంరక్షణ కోసం ఆడవాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు. రోజువారీ పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా చర్మ సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముఖ్యంపై నల్లని మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. ఎన్నో కాస్మటిక్స్ వినియోగించినా వాటిల్లోని రసాయనాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయే తప్ప ఫలితం ఉండదు. పార్లర్‌కు వెళ్లి ఫేషియల్, బ్లీచింగ్ చేయించినా దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు. ఇంట్లోనే సహజ పద్ధతుల్లో తయారు చేసే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా ముఖంపై నల్ల మచ్చలను నివారించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

రాత్రి నిద్ర పోయే ముందు వారానికి రెండు సార్లు కాఫీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మెరుపు తిరిగి వస్తుంది. నల్లమచ్చలు సులభంగా తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది. చర్మ రంధ్రాలు కూడా తెరుచుకుంటాయి.

కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. కాఫీ ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మురికిని, మలినాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, తాజాగా మారుస్తుంది.

అంతేకాకుండా కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలోనూ కాఫీ సహాయపడుతుంది. ఈ కాఫీ ప్యాక్‌కు సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించే సామర్థ్యం ఉంటుంది.

దీనిని ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ మాయిశ్చరైజర్, కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. ముఖానికి అప్లై చేసి ఆరాక నీళ్లతో కడిగేస్తే సరి.





























