Andhra Pradesh: మెరుగు పేరుతో బంగారు ఆభరణాలు చోరీ.. అచ్చం ‘ఇంద్ర’ సినిమాలో మాదిరి..

కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు అందిన కాడికి దండుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహాన కల్పించిన ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఇటువంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. కుక్కర్‌లో ఉడకబెట్టి బంగారు ఆభరణాలను మెరుగుపరుస్తామని చెప్పి ఓ దొంగళ ముఠా..

Andhra Pradesh: మెరుగు పేరుతో బంగారు ఆభరణాలు చోరీ.. అచ్చం 'ఇంద్ర' సినిమాలో మాదిరి..
Gold Jewellery
Follow us
T Nagaraju

| Edited By: Srilakshmi C

Updated on: Sep 15, 2023 | 11:24 AM

గుంటూరు, సెప్టెంబర్‌ 15: కొంతమంది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసగాళ్లు అందిన కాడికి దండుకుంటున్నారు. కొత్త కొత్త మోసాలు చేస్తున్నారు. పోలీసులు ఎంత అవగాహాన కల్పించిన ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు. ఇటువంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. కుక్కర్‌లో ఉడకబెట్టి బంగారు ఆభరణాలను మెరుగుపరుస్తామని చెప్పి ఓ దొంగళ ముఠా నగలు కాజేసింది.

గుంటూరు నగరంలోని పండరీపురం ఐదో లైన్ లోని రమేష్ ఇంటి వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇంటిలో రమేష్ ఒక్కరే ఉన్నట్లు గుర్తించారు. చిన్నగా ఇంటి తలుపులు తట్టి లోపలకి వెళ్లారు. వెండి, రాగి ఆభరణాలకు ఇంటి వద్దే మెరుగుపడతామని చెప్పారు. మీ కళ్ల ముందే మెరుగుపడతామని ఛార్జీలు కూడా పెద్దగా ఎక్కువ ఇవ్వనసరం లేదన్నారు. దీంతో రమేష్ వెండి, రాగి వస్తువులను వారికి అందించారు. కొద్దిసేపు అక్కడ మెరుగుపట్టిన యువకులు తళతళ మెరిసే రాగి, వెండి వస్తువులను తిరిగి రమేష్ కు అందించారు.

అంతటితో ఊరుకోకుండా బంగారు ఆభరణాలు కూడా తీసుకొస్తే మెరుగుపట్టి ఇస్తామన్నారు. దీంతో నమ్మకం కుదిరిన రమేష్ 25 సవర్ల బంగారు ఆభరణాలను తీసుకొచ్చి ఆ ఇద్దరి యువకులకు ఇచ్చారు. కుక్కర్ తీసుకు రావాలని చెప్పిన యువకులు రమేష్ కళ్ల ముందే బంగారు ఆభరణాలను కుక్కర్ లో వేశారు. అనంతరం కొద్దీగా పసుపు తీసుకురావాలని చెప్పడంతో రమేష్ ఇంటిలోకి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన యువకులు కుక్కర్ లోని బంగారు ఆభరణాలను తమ బ్యాగ్ లో వేసుకున్నారు. పసుపు తీసుకొచ్చిన రమేష్ కళ్ళ ముందే కుక్కర్ లో కొద్దీగా పసుపు వేశారు. ఒక పదినిమిషాల తర్వాత కుక్కర్ తెరిచి బంగారు ఆభరణాలు తీసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ మాట చెప్పి అక్కడ నుండి ఆ ఇద్దరు యువకులు ఉడాయించారు. అయితే పదినిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేయగా అందులో బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో రమేష్ పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇంద్ర సినిమాలో గంగలో ముంచితే బంగారం రెండింతలు అవుతుందని ఓ ముఠా మోసం చేసిన విధంగానే మెరుగు పేరుతో ముఠా మోసం చేయడాన్ని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!