Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: వీడు తండ్రి కాదు.. నరరూప రాక్షసుడు! మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 8 రోజుల పసికందుపై దాష్టికం

మూడోసారి కూడా కాన్పులో ఆడపిల్ల పుట్టిందని ఆ తండ్రి కడుపు రగిలిపోయింది. అంతే.. కళ్లు కూడా తెరవని పసికందును నిర్ధాక్షిణ్యంగా హత మార్చాడు. అత్యంత దారుణంగా నోట్లో పొగాకు కుక్కి ఊరిరాడకుండా చేసి పురిటి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన..

Crime News: వీడు తండ్రి కాదు.. నరరూప రాక్షసుడు! మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని 8 రోజుల పసికందుపై దాష్టికం
Maharashtra Man Killed His Daughter
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 15, 2023 | 10:18 AM

భోపాల్‌, సెప్టెంబర్ 15: మూడోసారి కూడా కాన్పులో ఆడపిల్ల పుట్టిందని ఆ తండ్రి కడుపు రగిలిపోయింది. అంతే.. కళ్లు కూడా తెరవని పసికందును నిర్ధాక్షిణ్యంగా హత మార్చాడు. అత్యంత దారుణంగా నోట్లో పొగాకు కుక్కి ఊరిరాడకుండా చేసి పురిటి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని పహూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జామ్నేర్ తాలూకాకు చెందిన గోకుల్ గోతిరామ్ జాదవ్ (30) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ముందు పుట్టిన ఇద్దరూ ఆడపిల్లలే. సెప్టెంబర్ 2న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అతని భార్య వకోడ్‌ మరో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో మనస్తాపం చెందిన తండ్రి జామ్నేర్ భార్యపై కోపంతో రగిలిపోయాడు. సెప్టెంబర్ 10వ తేదీన 8 రోజుల పసికందు నోట్లో పొగాకు కుక్కాడు. దీంతో ఊపిరి ఆడక ఆడశిశువు మరణించింది. బర్త్ రిజిస్టర్ చేసుకునేందుకు అతని ఇంటికి వచ్చిన ఆశా వర్కర్‌ బిడ్డ గురించి వాకబు చేసింది. తన మూడో సంతానం లేదని, తన చేతులతో తానే స్వయంగా చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. విషయం తెలుకున్న ఆశా వర్కర్‌ అధికారులకు తెలియజేసింది.

వైద్యాధికారి డాక్టర్‌ సందీప్‌ కుమావత్‌ మంగళవారం గ్రామానికి చేరుకుని చిన్నారి గురించి నిందితుడు జాదవ్‌ను అడిగారు. తొలుత అనారోగ్యం కారణంగా చిన్నారి మృతి చెందినట్లు డాక్టర్ సందీప్‌ కుమావత్‌కు తెలిపిన నిందితుడు ఆ తర్వాత చిన్నారిని హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఫర్దాపూర్ వాకోడ్ రహదారిపై గొయ్యి తవ్వి రాత్రికి రాత్రే మృతదేహాన్ని ఖననం చేసినట్లు తెలిపాడు. దీనిపై డాక్టర్‌ సందీప్‌ కుమావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాదవ్‌పై కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. పసిబిడ్డను పాతిపెట్టిన స్థలంలో తవ్వకాలు జరిపి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా సెప్టెంబరు 10న థానే జిల్లాలో భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి 18 నెలల కుమార్తెను కొట్టి చంపిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.