Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditya L1: నేడు భూమి నాల్గవ కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఇంజెక్ట్.. ప్రతిరోజూ 1440 ఫోటోలు తీస్తున్న ఆదిత్య 

చంద్రయాన్-3 తర్వాత సూర్యుడి గురించి పరిశోధించడానికి బయలుదేరిన ఆదిత్య ఎల్1 మరో అడుగు ముందుకు వేయనుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు కొంతకాలం పాటు దాని ఇంజిన్‌లను ఆన్ చేస్తారు.. తద్వారా ఆదిత్య L-1 భూమి తదుపరి కక్ష్యలోకి ప్రవేశించవనుంది. ఇది నాల్గవ కక్ష్య కానుంది.  ఇప్పటివరకు ఈ భారత అంతరిక్ష నౌక మూడవ కక్ష్యలో తిరుగుతోంది.

Aditya L1: నేడు భూమి నాల్గవ కక్ష్యలోకి ఆదిత్య ఎల్1 ఇంజెక్ట్.. ప్రతిరోజూ 1440 ఫోటోలు తీస్తున్న ఆదిత్య 
Aditya L1 Mission
Follow us
Surya Kala

|

Updated on: Sep 15, 2023 | 8:11 AM

సూర్యుని అపరిష్కృత రహస్యాలను తెలుసుకోవడానికి ఇస్రో సెప్టెంబర్ 2 న ఆదిత్య L-1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఇది భూమి, సూర్యుని మధ్య ఉన్న లాంగ్రెస్ పాయింట్‌కి అంటే L1కి వెళుతుంది. ఇప్పటి వరకు భూమి చుట్టూ మూడు కక్ష్యలను పూర్తి చేసింది. చివరిసారిగా సెప్టెంబర్ 10న భూమి మూడవ కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. దీని ఇంజన్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 2 గంటలకు కాసేపట్లో స్విచ్ ఆన్ చేయబడతాయి.. తద్వారా భూమి నాల్గవ కక్ష్యలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది.

అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆదిత్య L1

ఆదిత్య L1 భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రెస్ పాయింట్‌కి ప్రయాణించాలి.  ఇది భూమికి సూర్యుని మధ్య ఐదు లాంగ్రేసియన్ పాయింట్లలో మొదటిది. ఈ పాయింట్ భూమి నుంచి  సూర్యుని గురుత్వాకర్షణ మధ్య సమతుల్యత ఉన్న ప్రదేశంలో ఉంది. అంటే ఇక్కడ ఆదిత్య L1 స్థిరంగా ఉంటుంది. ఇక్కడ ఆదిత్య అలసిపోకుండా .. ఆగకుండా నిరంతరం పని చేస్తుంది. ఈ బిందువు భూమి.. సూర్యుని మధ్య ఉన్నందున.. ఇది పగలు .. రాత్రులతో ప్రభావితం కాదు.

ప్రతిరోజూ 1440 ఫోటోలు తీస్తున్న ఆదిత్య

ISRO ఆదిత్య L1తో ఏడు పేలోడ్‌లను పంపింది. అత్యంత ప్రత్యేకమైనది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ లేదా VELC ఇది సూర్యుని చిత్రాలను నిరంతరం తీస్తుంది. ఆదిత్య-ఎల్1 ప్రాజెక్ట్ సైంటిస్ట్ డాక్టర్ ముత్తు ప్రియాల్ ప్రకారం ఈ పరికరం 24 గంటల్లో చంద్రుని  దాదాపు 1440 ఛాయాచిత్రాలను తీస్తుంది. ప్రతి నిమిషానికి ఒక చిత్రం ఇస్రోకు చేరుతుంది. ఇది సూర్యుని రహస్యాలను ఛేదించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆదిత్య నెక్స్ట్ జర్నీ

ఆదిత్య L-1 భూమి ఐదు కక్ష్యలను ప్రదక్షిణ చేసిన తర్వాత భూమి గురుత్వాకర్షణ క్షేత్రం నుండి నిష్క్రమిస్తుంది. దీని తర్వాత అది L1 వైపు వెళుతుంది. ఈ ప్రక్రియను క్రూయిజ్ స్టెప్ అంటారు. దీనిలో ఇది తన ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేస్తుంది. ఇక్కడి నుంచి దాదాపు 110 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత ఎల్1 పాయింట్‌కి వెళ్లి అక్కడ హలో ఆర్బిట్‌లో ఏర్పాటు చేస్తారు.

ఆదిత్య ఎల్-1 ఏ పని చేస్తుందంటే

ISRO మొదటి సోలార్ మిషన్ ఆదిత్య L1 సూర్యునికి చెందిన అపరిష్కృత రహస్యాలను ఛేదిస్తుంది. నాసా మాజీ శాస్త్రవేత్త డాక్టర్ మిలా మిత్ర ప్రకారం ఇది సూర్యుని ఉష్ణోగ్రత, సౌర తుఫానులు, భూమిపైకి వచ్చే  తరంగాలను, సూర్యుని బయటి కవచం గురించి తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఇది సౌర వాతావరణంపై నిఘా ఉంచుతుంది, తద్వారా సూర్యుడి గురించి తెల్సుకుని ఇస్రో భవిష్యత్తు ప్రయోగాల గురించి సిద్ధమవుతారు. ముఖ్యంగా సౌర తుఫానుల గుర్తించి వాటి నుంచి ఉపగ్రహాలను రక్షించగలదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..