Uttar Pradesh: 70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. కానీ ప్రారంభోత్సవానికి ముందే కట్‌..

Uttar Pradesh: 70 ఏళ్ల తర్వాత గ్రామానికి నీళ్లు.. కానీ ప్రారంభోత్సవానికి ముందే కట్‌..

Anil kumar poka

|

Updated on: Sep 15, 2023 | 8:17 AM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లూ మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ పైన కావాలంటే పక్క గ్రామాలకు నడిచివెళ్లి తెచ్చుకోవాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ జిల్లా లహురియాదహ్‌ గ్రామస్థుల కష్టాలివి. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్‌ కలెక్టర్‌ దివ్యా మిత్తల్‌ ఇంటింటికీ..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఆ గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సదుపాయం లేదు. మూడు రోజులకోసారి వచ్చే ట్యాంకర్ల నీటిని పట్టుకొని నిల్వ చేసుకుంటారు. ఆ నీళ్లూ మనిషికి 15 లీటర్లు మాత్రమే. ఆ పైన కావాలంటే పక్క గ్రామాలకు నడిచివెళ్లి తెచ్చుకోవాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌ జిల్లా లహురియాదహ్‌ గ్రామస్థుల కష్టాలివి. ఈ కష్టాలు చూసి స్పందించిన మీర్జాపుర్‌ కలెక్టర్‌ దివ్యా మిత్తల్‌ ఇంటింటికీ తాగునీరు అందించే పథకం ‘జల్‌జీవన్‌ మిషన్‌’ కింద ఆగస్టు 29న గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేయించారు. గ్రామానికి తాగునీరు అందిన మూడు రోజుల్లోనే కలెక్టర్‌ మరోచోటుకు బదిలీ అయ్యారు. కొళాయిల పైపులను గుర్తుతెలియని వ్యక్తులు కట్‌ చేశారు. గ్రామస్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. తెర వెనుక ఏమి జరిగిందంటే.. జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభోత్సవానికి తమను పిలవకుండా కలెక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నేతలు ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..