Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

Phani CH

|

Updated on: Sep 14, 2023 | 8:57 PM

ఇటీవల జనం మీద సినిమా ప్రభావం బాగానే పడింది. ఏం చేసిన పక్కా ఫ్లాన్‌తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఎవరికీ అనుమానం రాకుండా.. ఇంటి ఓనరే.. తానూ అద్దెకు ఇచ్చిన షాపులోనే కన్నం వేశాడు. ఈ ఇంటి దొంగ ఎలా ప్లాన్ చేశాడన్న దానిపై కూపీ లాగిన పోలీసులకు షాకయ్యే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ...

ఇటీవల జనం మీద సినిమా ప్రభావం బాగానే పడింది. ఏం చేసిన పక్కా ఫ్లాన్‌తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఎవరికీ అనుమానం రాకుండా.. ఇంటి ఓనరే.. తానూ అద్దెకు ఇచ్చిన షాపులోనే కన్నం వేశాడు. ఈ ఇంటి దొంగ ఎలా ప్లాన్ చేశాడన్న దానిపై కూపీ లాగిన పోలీసులకు షాకయ్యే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు ఎవరికీ అనుమానం రాకుండా యువతి వేషధారణ ధరించి తన భవనంలోని దుకాణంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. భార్యకు సంబంధించిన సవరం, అమె డ్రెస్ ధరించి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనం చేశాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో పోలీసులు 48 గంటల్లోనే కేసును ఛేదించారు. రామిండ్ల నాంపల్లికి చెందిన భవనంలో సింగారం గ్రామానికి చెందిన గనగోని బంటి లక్ష్మీనారాయణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ 9న రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. 11న ఉదయం దుకాణానికి వచ్చి చూడగా వెనుక ఉన్న తలుపు తీసి కనిపించింది. కౌంటరులోని నగదు అపహరణకు గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన

విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌

నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు

అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??