AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి... కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి… కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Phani CH
|

Updated on: Sep 14, 2023 | 9:00 PM

Share

రోజురోజుకి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా.. మరోవైపు మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్ డెలివరి చేసే యాప్‌ల వచ్చాక చాలామంది ఆహార అలవాట్లలో మార్పులు వచ్చేశాయి. కొంతమందైతే వండుకోవడమే మానేశారు. చివరికి వారి పిల్లలకు కూడా బయట నుంచి తెప్పించిన ఫుడ్‌నే పెడుతున్నారు. అయితే బయటి ఫుడ్ తినడంపై తాజాగా కేరళ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

రోజురోజుకి సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఓవైపు టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా.. మరోవైపు మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్ డెలివరి చేసే యాప్‌ల వచ్చాక చాలామంది ఆహార అలవాట్లలో మార్పులు వచ్చేశాయి. కొంతమందైతే వండుకోవడమే మానేశారు. చివరికి వారి పిల్లలకు కూడా బయట నుంచి తెప్పించిన ఫుడ్‌నే పెడుతున్నారు. అయితే బయటి ఫుడ్ తినడంపై తాజాగా కేరళ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలను ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునేలా ప్రోత్సహించండి.. అలిసిపోయి ఇంటికి వచ్చే సమయానికి కమ్మగా వండి పెట్టండి అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిన్నారుల తల్లులకు సూచించారు. తల్లి చేతి వంటలోని ఆనందాన్ని పిల్లలు ఆస్వాదించేలా చూడాలని చెప్పారు. అంతేకానీ వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి స్విగ్గీలు, జొమాటాలలో ఆర్డర్ పెట్టుకునేలా ప్రోత్సహించవద్దని చెప్పారు. మైనర్ల చేతికి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తరచూ గమనిస్తూ ఉండాలని చెప్పారు. సరైన పర్యవేక్షణ లేకుంటే పిల్లల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ తో అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఓ కేసు విచారణలో భాగంగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన

విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌

నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు

 

Published on: Sep 14, 2023 08:58 PM