సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌

సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌

Phani CH

|

Updated on: Sep 14, 2023 | 8:52 PM

అడవి చాలా అద్భుతమైనది. అడవి జంతువులు ఆహారం కోసం తప్ప మరో జంతువుపై దాడి చేయవు. అనవసరంగా మరో జంతువు జోలికి వెళ్లవు. అడవికి రాజు అయిన సింహం కూడా వేరే జంతువుతో ఘర్షణ పడదు. అవసరమైతే వెనక్కి తగ్గి దూరంగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే సింహాల ప్రవర్తన ఆశ్చర్యం అనిపించకమానదు. IFS అధికారి సుశాంత నందా ఈ వీడియో ను ట్విటర్‌లో షేర్ చేశారు.

అడవి చాలా అద్భుతమైనది. అడవి జంతువులు ఆహారం కోసం తప్ప మరో జంతువుపై దాడి చేయవు. అనవసరంగా మరో జంతువు జోలికి వెళ్లవు. అడవికి రాజు అయిన సింహం కూడా వేరే జంతువుతో ఘర్షణ పడదు. అవసరమైతే వెనక్కి తగ్గి దూరంగా వెళ్లిపోతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే సింహాల ప్రవర్తన ఆశ్చర్యం అనిపించకమానదు. IFS అధికారి సుశాంత నందా ఈ వీడియో ను ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో రెండు సింహాలు రోడ్డు మధ్యలో పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాయి. అంతలో అదే మార్గం గుండా రెండు ఖడ్గమృగాలు నడుచుకుంటూ వస్తున్నాయి. వాటిని చూసిన సింహాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనను పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సింహాలు, పులులు అడవికి రాజులు కాదు. అంతా పరిస్థితులను బట్టి ఉంటుంది“ అని సుశాంత నందా కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు

అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??

భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..

థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్‌.. ఇక్కడ కూడా ఆపర

హోటల్లో టేబుల్‌ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..