హోటల్లో టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..
ఇటీవల మరణాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. చూస్తుండగానే జనాలు కుప్పకూలిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు హోటల్‌లో టేబుల్ క్లీన్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంత లేపినా లేవలేదు. దాంతో అక్కడున్నవారంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధిలోని విజయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో రవి అనే 18 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు.
ఇటీవల మరణాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. చూస్తుండగానే జనాలు కుప్పకూలిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు హోటల్‌లో టేబుల్ క్లీన్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంత లేపినా లేవలేదు. దాంతో అక్కడున్నవారంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ పరిధిలోని విజయనగర్ ప్రాంతంలోని ఓ హోటల్లో రవి అనే 18 ఏళ్ల యువకుడు పనిచేస్తున్నాడు. రోజూ లాగే ఆ రోజు కూడా పనికి వెళ్లాడు. పగలంతా హోటల్‌కి వచ్చిన వారికి అవసరమైన పుడ్ సప్లై చేసాడు. రాత్రి హోటల్ మూసే సమయంలో టేబుల్స్ శుభ్రం చేయడం మొదలెట్టాడు. చివరగా ఓ టేబుల్ శుభ్రం చేసి పక్కకు జరుపుతున్నాడు. అంతే ఒక్కసారిగా కాలుజారి పడినట్టు పడిపోయాడు. ఎంతకీ పైకి లేవకపోవడంతో హోటల్ సిబ్బంది కంగారుగా అక్కడికి వచ్చి అతన్ని పైకి లేపారు. అతనిలో చలనం లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..