Ayodhya Ram Mandir: 25 అడుగుల దూరం నుంచి 20 సెకన్లలో రామయ్య దర్శనం.. రామాలయ ప్రాంగణంలో నిబంధనలు కఠినతరం
ఆలయంలోని ఇతర అంతస్తును డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేస్తామని, మిగిలిన ప్రాంగణం డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందని నృపేంద్ర మిశ్రా చెప్పారు. భద్రత పరంగా ఇక్కడ భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయని ఆలయ భద్రత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండగా, కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ ఓ కన్నేసి ఉంచనుందని వెల్లడించారు. శ్రీ రామయ్య దర్శనం కోసం 50 వేల నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే విధంగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రామ జన్మ భూమి అయోధ్యలో నిర్మిస్తున్న చారిత్రక రామ మందిర నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆలయంలో కొలువుదీరనున్న రామయ్యను వచ్చే ఏడాది ప్రారంభం నుంచే దర్శనం చేసుకోనున్నారు. ప్రారంభ తేదీ దగ్గర పడుతుండడంతో రామమందిరంలో దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నారు ఆలయ సిబ్బంది. ఈ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం కేవలం 20 సెకన్లు మాత్రమే కేటాయించారు. అంతేకాదు ఎవరైనా సరే ఆలయ ప్రాంగణంలో ఒక గంట కంటే ఎక్కువ సమయం ఉండడానికి వీలు లేదని రామ మందిరానికి సంబంధించి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కీలక ప్రకటన చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. రామ మందిరానికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతుందని చెప్పారు. శ్రీరాముడు ప్రధాన విగ్రహం జనవరి 2024లో ఆలయంలో ప్రతిష్టించబడుతుందని నృపేంద్ర మిశ్రా చెప్పారు. ఈ వేడెక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు.. ఇప్పటికే తాము ఆహ్వానించినట్లు వెల్లడించారు.
ఆలయ భద్రతా కోసం చర్యలు చేపట్టిన ప్రభుత్వం
ఆలయంలోని ఇతర అంతస్తును డిసెంబర్ 2024 నాటికి పూర్తి చేస్తామని, మిగిలిన ప్రాంగణం డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతుందని నృపేంద్ర మిశ్రా చెప్పారు. భద్రత పరంగా ఇక్కడ భారీ ఎత్తున పనులు జరుగుతున్నాయని ఆలయ భద్రత రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండగా, కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ ఓ కన్నేసి ఉంచనుందని వెల్లడించారు. శ్రీ రామయ్య దర్శనం కోసం 50 వేల నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే విధంగా ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
శ్రావణ ఝులోత్సవ దర్శనం
श्रावण झूलनोत्सव दर्शन
श्रावण मास में रजत मंडित झूले पर विराजमान भगवान श्री रामलला सरकार के दर्शन pic.twitter.com/mbvZPvM1k8
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 22, 2023
రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిరంతరం కనిపిస్తూ వైరల్ అవుతున్నాయి. దర్శనం ఎలా ఉంటుందన్న ఉత్సుకత భక్తుల్లో నెలకొంది. ఆలయంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రద్దీ దృష్ట్యా ఒక భక్తుడికి రామయ్య దర్శనానికి సగటున 20 సెకన్ల సమయం మాత్రమే లభిస్తుందని నృపేంద్ర మిశ్రా చెప్పారు. శ్రీ రాముడి విగ్రహం ప్రతిష్టించబడే ప్రదేశం నుండి 25 అడుగుల దూరం నుంచి మాత్రమే భక్తులు రాముడిని దర్శనం చేసుకోగలరు.. అక్కడ నుంచి భక్తులు క్యూలో ముందుకు కదులుతారు.. అలా రాముడిని దర్శించుకుంటారు.
श्री रामजन्मभूमि मंदिर के प्रथम तल पर द्रुत गति से चल रहे निर्माण कार्य की एक झलक
Glimpses of construction work going on at Shri Ramjanmabhoomi Mandir in Ayodhya ji. pic.twitter.com/mn24R83yHC
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 6, 2023
భక్తులు 1 గంట పాటు ప్రాంగణంలో ఉండగలరు
రామయ్య ఆలయ ప్రాంగణం చాలా పెద్దది కాబట్టి.. రామయ్య ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుంచి దర్శనానికి 45 నిమిషాలు పడుతుందని నృపేంద్ర మిశ్రా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఒక భక్తుడు సుమారు గంటసేపు ఆలయంలో ఉంటాడని తెలిపారు. 71 ఎకరాల విస్తీర్ణంలో రామ మందిరం సముదాయం కాకుండా మిగిలిన సందర్శన స్థలాలు కూడా భక్తుల కోసం సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. రామ మందిర సముదాయాల్లో శ్రీ రాముడి ప్రయాణాన్ని వర్ణించే విధంగా నిర్మిస్తున్నారు.
రామ మందిర సమస్య కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూనే.. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో 2020లో ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయోధ్యలో రామయ్య ఆలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి భక్తులు రాంలాలాను దర్శించుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..