Hero Ajith: హీరో అజిత్‌కు రక్షణ శాఖ కీలక బాధ్యత.. ఏడాదిలో 200 డ్రోన్లను తయారు చేసే కాంట్రాక్ట్‌.. వీటి స్పెషాలిటీ ఏమిటంటే..

అజిత్ నటుడు మాత్రమే కాదు,. మంచి బైక్ రేసర్.. కారు రేసర్ అన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు ఏరో స్పేస్‌కు సంబంధించి కోర్సులు కూడా చేశాడు. ఓ వైపు సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే.. తన అభిరుచి మేరకు ఫైటర్‌జెట్‌ నడపడానికి ట్రైనింగ్‌ తీసుకున్నాడు. పైలట్‌గా లైసెన్స్‌ ను కూడా అజిత్ తీసుకున్నాడు. షూటింగుల వల్ల విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అజిత్‌ స్థానికంగా ఉన్న యూనివర్సిటీలకు వెళుతుంటాడు.

Hero Ajith: హీరో అజిత్‌కు రక్షణ శాఖ కీలక బాధ్యత.. ఏడాదిలో 200 డ్రోన్లను తయారు చేసే కాంట్రాక్ట్‌.. వీటి స్పెషాలిటీ ఏమిటంటే..
Ajith Kumar's Team 'daksha'
Follow us

|

Updated on: Aug 28, 2023 | 7:42 AM

అచ్చ తెలుగబ్బాయి.. కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు అప్పగించింది. భారత దేశం.. దాయాది పాకిస్తాన్ బోర్డర్ ప్రాంతాల్లో మరింత నిఘా పెంచేందుకు చర్యలు పెట్టి.. డ్రోన్స్ ఏర్పాటుపై ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఆ డ్రోన్స్ ను తయారు చేసే బాధ్యతను రక్షణ శాఖ హీరో అజిత్ కు ఇచ్చింది. అవును భారత రక్షణ శాఖ హీరో అజిత్‌ కుమార్‌ చేతిలో ఓ కీలకమైన ప్రాజెక్టును పెట్టింది. భారత్ – పాక్ సరిహద్దుల్లో కావాలా కోసం డ్రోన్స్ ను తయారు చేసే పనిని అజిత్ కు ఇచ్చింది.  అజిత్ నటుడు మాత్రమే కాదు,. మంచి బైక్ రేసర్.. కారు రేసర్ అన్న సంగతి తెలిసిందే.. అంతేకాదు ఏరో స్పేస్‌కు సంబంధించి కోర్సులు కూడా చేశాడు. ఓ వైపు సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే.. తన అభిరుచి మేరకు ఫైటర్‌జెట్‌ నడపడానికి ట్రైనింగ్‌ తీసుకున్నాడు. పైలట్‌గా లైసెన్స్‌ ను కూడా అజిత్ తీసుకున్నాడు. షూటింగుల వల్ల విదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అజిత్‌ స్థానికంగా ఉన్న యూనివర్సిటీలకు వెళుతుంటాడు. ఏరోస్పేస్‌కు సంబంధించి అప్‌డేట్స్‌ కనుక్కుని ఆన్‌లైన్‌లోనే విద్యార్థులకు పాఠాలు చెబుతుంటాడు.

అంతేకాదు అజిత్ కొంతమంది  ఎమ్‌ఐటీలో ఏరోస్పేస్‌ రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ తో కలిసి దక్ష అనే ఒక గ్రూవ్ ను తయారు చేశారు. వారితో కలిసి అజిత్‌ తక్కువ సమయంలో ఎక్కువ బరువుని తీసుకుని వెళ్లే  డ్రోన్‌ ట్యాక్సీ, డ్రోన్‌ అంబులెన్స్‌ను తయారు చేశాడు. ఈ డ్రోన్స్ పని తీరు అద్భుతం అని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ డ్రోన్స్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పోటీలో సెకండ్ ప్లేస్ లో నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ డ్రోన్స్ కాకులు దూరని కారడవుల్లో కూడా తమ సేవలను అందించగలవు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు కూడా వెళ్లి అక్కడ తమ సేవలను అందిస్తాయి.  బ్లడ్, మెడిసిన్ అందజేసిన ఆ డ్రోన్‌కు 2019 లో భారత డ్రోన్‌ ఒలింపిక్స్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీంతో అజిత్ ప్రతిభను గుర్తించిన తమిళనాడు సర్కార్..  సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో అందించే అబ్దుల్‌ కలాం అవార్డును అజిత్‌కు అందించింది.

ఇవి కూడా చదవండి

అజిత్ తయారు చేసిన ఈ డ్రోన్స్ సేవలు కరోనా సమయంలో అక్కడ ప్రభుత్వం వినియోగించుకుంది. ఈ విషయం భారత రక్షణ శాఖ దృష్టికి చేరుకుంది. అప్పుడు అజిత్ నేతృత్వంలోని దక్ష టీమ్ తయారు చేసిన డ్రోన్స్ గురించి తెలుసుకుంది. వెంటనే సరిహద్దుల్లో నిఘా కోసం..  డ్రోన్ల తయారు చేయమంటూ అజిత్‌ను సంప్రదించింది.

వెంటనే ఏడాదిలో దాదాపు 200 డ్రోన్లను తయారు చేసేలా ఒక ప్రాజెక్ట్ ను అజిత్ చేతిలో పెట్టింది రక్షణ శాఖ.  ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు  170 కోట్ల రూపాయలు. ఈ దక్ష టీమ్ రూపొందించిన డ్రోన్లను భారత్‌- పాక్‌ సరిహద్దుల్లో నిఘా పెట్టడమే కాదు.. ఎక్కడైనా విపత్తులు ఏర్పడితే.. అక్కడ సహాయక కార్యక్రమాల కోసం భారత రక్షణ శాఖ వినియోగించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ