Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3D Printed Post Office: ఇటుక, రాయిలేకుండా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోస్టాఫీస్ నిర్మాణం..

3డి ప్రింటర్ అనేక రకాల మెషీన్‌లను కలపడం ద్వారా తయారు చేయబడింది. మిక్సర్, పంపింగ్ యూనిట్, మోషన్ అసెంబ్లీ, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్, నాజిల్, ఫీడింగ్ సిస్టమ్ వంటివి. ఈ మెషిన్ ముఖ్యమైన భాగం  నిర్మాణం కోసం పనిచేస్తుంది. ప్రింటర్ సహాయంతో నిర్మాణ సామగ్రి బయటకు వస్తూనే ఉంటుంది.. అదే సమయంలో భవనం నిర్మాణం కొనసాగుతుంది.

3D Printed Post Office: ఇటుక, రాయిలేకుండా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పోస్టాఫీస్ నిర్మాణం..
3d Printed Post Office
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2023 | 10:31 AM

బెంగళూరులో 3డి ప్రింటింగ్‌తో రూపొందించిన పోస్టాఫీసును కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దేశంలోనే 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో రూపొందించిన తొలి పోస్టాఫీసు ఇదే. బెంగళూరులోని కేంబ్రిడ్జ్ లేఅవుట్ సమీపంలోని ఉల్సూర్ మార్కెట్‌లో దీన్ని తయారు చేశారు. దీనిని నిర్మించిన సాంకేతికత అనేక విధాలుగా ప్రత్యేకమైనది. సాధారణంగా 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలంటే దాదాపు 12 నెలల సమయం పడుతుంది. అయితే కొత్త పోస్టాఫీసును కేవలం 44 రోజుల్లోనే నిర్మించారు. అటువంటి పరిస్థితిలో ఆ 3డి ప్రింటింగ్ టెక్నిక్ ఏమిటి, పోస్టాఫీస్ ఎంత భిన్నంగా తయారు చేయబడింది, సాధారణ నిర్మాణంతో పోలిస్తే ఇది ఎంత చౌకగా, మన్నికైనది.. దేశంలో ఎక్కడ నిర్మాణాలు జరిగాయో తెలుసుకుందాం..

3డి ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి?

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పేరు వినగానే చాలా మందికి ప్రింటర్‌తో కనెక్షన్ ఉందని అర్థం అవుతుంది.  అయితే ఇది పూర్తిగా అలా కాదు. ఈ టెక్నిక్‌లో పొరల వారీగా గోడ, పైకప్పు, భూమిని రోబోటిక్స్ ద్వారా నిర్మించారు. యంత్రానికి ఎలాంటి నిర్మాణం, డిజైన్ సూచనలు ఇవ్వరు. యంత్రం స్వయంచాలకంగా దానికి అదే భవనాన్ని నిర్మిస్తుంది. ఈ యంత్రం ఇంటిని సిద్ధం చేయడంలో అనేక విధాలుగా మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా భవన నిర్మాణాల కోసం ఇటుకను ఉపయోగిస్తారు.. అయితే 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేయబడిన నిర్మాణంలో ఇటుకలు ఉపయోగించలేదు. ఈ టెక్నిక్‌తో తక్కువ సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇటుక, ఇతర నిర్మాణాల ద్వారా తయారు చేయబడిన భవనంతో పోలిస్తే ఈ సాంకేతికత ద్వారా త్వరగా భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చు.

త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మించిన పోస్టాఫీసు

సాంకేతికత ఎలా పని చేస్తుందంటే?

సాధారణంగా ఇల్లు లేదా నిర్మాణాన్ని సిద్ధం చేయడంలో నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను సిద్ధం చేస్తారు. దానిని అనుసరిస్తూ ఇంటిని నిర్మిస్తారు. అయితే 3డి ప్రింటింగ్ విషయంలో ఇది జరగదు. ఇందులో అంతా కంప్యూటరీకరించారు. కంప్యూటర్‌లో ఫీడ్ చేయబడిన మ్యాప్, రోబోటిక్స్ సహాయంతో..  ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. రోబోటిక్ వ్యవస్థ గోడ  వెడల్పు ఎంత అవసరమో, ఎత్తు , లోపలి భాగాల్లో ఎక్కడ, ఏమి నిర్మించాలో నిర్ణయిస్తుంది.

3డి ప్రింటర్ అనేక రకాల మెషీన్‌లను కలపడం ద్వారా తయారు చేయబడింది. మిక్సర్, పంపింగ్ యూనిట్, మోషన్ అసెంబ్లీ, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్, నాజిల్, ఫీడింగ్ సిస్టమ్ వంటివి. ఈ మెషిన్ ముఖ్యమైన భాగం  నిర్మాణం కోసం పనిచేస్తుంది. ప్రింటర్ సహాయంతో నిర్మాణ సామగ్రి బయటకు వస్తూనే ఉంటుంది.. అదే సమయంలో భవనం నిర్మాణం కొనసాగుతుంది.

నిర్మాణం ఎలా జరుగుతుందో చూడండి

నిర్మాణం చాలా చౌకగా..  బలంగా ఉంటుంది

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ వల్ల భారత్‌లో నిర్మాణ రంగంలో పెను మార్పు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీని సాయంతో తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించుకోవచ్చు. ఫస్ట్‌పోస్ట్ నివేదికలో, 3D ప్రింటింగ్ కంపెనీ Nexa3D CEO, చైర్మన్ Avi, ఈ సాంకేతికతతో ఇంటిని నిర్మిస్తే, చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. సాధారణ నిర్మాణంతో పోలిస్తే ఇది తక్కువ సమయంలో తయారు చేయబడుతుంది. తక్కువ ఖర్చు అవుతుంది.. బలంగా ఉంటుంది.

ఈ టెక్నాలజీతో దేశంలో ఏం సిద్ధం చేశారంటే..

ఈ సాంకేతికతతో దేశంలో ఇప్పటివరకు అనేక నిర్మాణాలు జరిగాయి. ఐఐటీ మద్రాస్ గతేడాది సెప్టెంబర్‌లో ఈ టెక్నాలజీతో ఇంటిని నిర్మించింది. ఆ తర్వాత దేశంలో అనేక నిర్మాణాలు జరిగాయి.

3డి ప్రింటింగ్‌తో తయారు చేసిన దేశంలోనే మొదటి ఇల్లు

గత ఏడాది అక్టోబర్‌లో, ఐఐటీ గౌహతి ఇండియన్ ఆర్మీ సైనికుల కోసం 3-డి ప్రింటెడ్ మాడ్యులర్ కాంక్రీట్ పోస్ట్‌ను సిద్ధం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..